Begin typing your search above and press return to search.
విధేయ రాముడిలో 'దమ్ము' కనిపిస్తుందట!
By: Tupaki Desk | 4 Dec 2018 1:30 AM GMTరామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తి అయిన విషయం తెల్సిందే. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఇటీవలే ట్రైలర్ తో సందడి చేసింది. ఇక నేడు ఈ చిత్రంలోని పాటను విడుదల చేయడం జరిగింది. ఫ్యామిలీ పాట అంటూ ముందే ప్రకటించి మరీ దర్శకుడు బోయపాటి ఈ పాటను వదిలాడు. పాట బాగుంది, పాటలోని విజువల్స్ కూడా బాగున్నాయి.
ఇక పాటలోని విజువల్స్ చూస్తుంటే గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘దమ్ము’ సినిమా గుర్తుకు వస్తుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దమ్ము సినిమాలోని ఎన్టీఆర్ లుక్ తరహాలోనే విదేయ రాముడిగా రామ్ చరణ్ కనిపిస్తున్నాడని, అలాగే కుటుంబ నేపథ్యం కూడా చాలా పెద్దగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథ పరంగా ఏమో కాని పాట చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ దమ్ము కనిపిస్తుందని సోషల్ మీడియా కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.
అన్నదమ్ముల అనుబంధంతో పాటు భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలోని ప్రత్యేక పాటను ఎవరు చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ రాలేదు. రంగస్థలం చిత్రం తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో ఆ సినిమా కలెక్షన్స్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి విధేయ రాముడు రంగస్థలం దాటేంత దమ్ము చూపించేనా అనేది చూడాలి.