Begin typing your search above and press return to search.
వాళ్లేం కోరుకున్నారో.. బోయపాటి ఏమిస్తాడో?
By: Tupaki Desk | 1 July 2017 9:54 AM GMTకొందరు దర్శకులకు ఒక శైలి ఉంటుంది. వాళ్లకో ఇమేజ్ ఉంటుంది. ఆ దర్శకులు తమ శైలిలోనే సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతారు. ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు. ప్రతిసారీ తమ బలాన్ని నమ్ముకునే ముందుకు వెళ్తారు. బోయపాటి శ్రీను ఈ తరహా దర్శకుడే. తొలి సినిమా ‘భద్ర’ దగ్గర్నుంచి.. గత ఏడాది వచ్చిన ‘సరైనోడు’ వరకు బోయపాటి సినిమాలన్నీ ఒక తరహాలో సాగిపోతాయి. మాస్ మసాలా అంశాలకే అతడి సినిమాల్లో పెద్ద పీట ఉంటుంది. ఈ ఫార్ములానే బోయపాటికి హిట్ల మీద హిట్లు ఇచ్చింది కాబట్టి దాన్ని వదిలిపెట్టడానికి అతనిష్టపడలేదు. చివరికి అల్లు అర్జున్ లాంటి క్లాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేస్తూ కూడా తన శైలిని విడిచిపెట్టలేదు.
‘సరైనోడు’తో బన్నీకి మాస్ లో మాంచి ఫాలోయింగ్ సంపాదించి పెట్టాడు బోయపాటి. అందుకే తన కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను బోయపాటి చేతుల్లో పెట్టాడు బెల్లంకొండ సురేష్. రూ.10 కోట్ల దాకా పారితోషకం.. సినిమా కోసం భారీ బడ్జెట్ ఇచ్చి సినిమా చేయించాడు. ఐతే బెల్లంకొండ ఫ్యామిలీ బోయపాటి నుంచి ఏం ఆశించిందో.. అతను ఏమిస్తున్నాడో అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. ‘జయ జానకి నాయక’ ప్రి లుక్ రిలీజైనపుడు ఇది పక్కా బోయపాటి మార్కు సినిమానే అనుకున్నారు.
కానీ ఈ చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి అందరి ఫీలింగ్ మారిపోయింది. బోయపాటి ఇంతకుముందు తీసిన సినిమాలకు.. వాటి టైటిళ్లకు.. ఈ టైటిల్ కు అసలు పొంతనే లేదు. పైగా ఇప్పుడు ఫస్ట్ లుక్ చూసినా కూడా క్లాస్ టచ్ కనిపిస్తోంది. మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తనకున్న బలాన్ని వదిలేసి.. బోయపాటి ఏదో ప్రయోగం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. తాను కూడా సున్నితమైన.. క్లాస్ టచ్ ఉన్న ప్రేమకథలు తీయగలనని రుజువు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా తోస్తోంది.
ఇలా బోయపాటి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడం సంగతేమో కానీ.. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందన్నదే ఇప్పుడు డౌటు. వేరే హీరోలతో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఓకే కానీ.. కెరీర్లో తొలి అడుగులు వేస్తూ.. మాస్ ఇమేజ్ కోసం తపించిపోతున్న బెల్లంకొండ బాబుతో ఈ రిస్క్ ఎందుకో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమాపై ఉన్న సందేహాలకు తెరదించుతూ.. తనకు అలవాటు లేని కొత్త జానర్ తోనూ బోయపాటి మెప్పిస్తాడా.. బెల్లంకొండ శ్రీనివాస్ కు సంతోషాన్ని మిగులుస్తాడా.. చూద్దాం ఆగస్టు 11న ఏం జరుగుతుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/