Begin typing your search above and press return to search.

బోయపాటి రియల్ స్టామినా తెలుస్తుందిలే

By:  Tupaki Desk   |   9 Aug 2017 5:30 PM GMT
బోయపాటి రియల్ స్టామినా తెలుస్తుందిలే
X
రాజమౌళికి ఒక ఈగ. త్రివిక్రమ్ కు ఒక అ..ఆ. వినాయక్ కు అల్లుడు శీను. ఈ సినిమాలన్నీ ఏంటంటే.. వీళ్ళందరూ సో కాల్డ్ స్టార్ డైరక్టర్లు అయినప్పటికీ.. అసలు పెద్ద పెద్ద స్టార్లు వీరి సినిమాల్లో లేకపోతే ఆ సినిమాలు ఎంత వసూలు చేస్తాయి అనేది.. వారి స్టామినాకు నిజమైన నిదర్శనం. ఇప్పుడు ఇదే తరహాలో ఇప్పటివరకు కేవలం స్టార్లతో సినిమాలను చేసిన బోయపాటి శ్రీను.. ఇప్పుడు జస్ట్ రైజింగ్ అవుతున్న బెల్లంకొండ శ్రీనుతో వస్తున్నాడు కాబట్టి.

ఇప్పటివరకు బోయపాటిని చూసి.. అలాగే సినిమాలోని ఇతర స్టార్ క్యాస్టింగ్ మరియు స్టార్ హీరోయిన్లను చూసి ''జయ జానకి నాయక'' సినిమాను ఏకంగా 31 కోట్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనుక్కున్నారు. అలాగే కర్ణాటక.. అమెరికాను కలిపితే.. మొత్తంగా ఈ సినిమా ధియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాల్లో కలిపి 34 కోట్లకు కొనుక్కున్నారు. కాబట్టి.. ఈ సినిమా ఏకంగా 70 కోట్లు గ్రాస్ వసూలు చేస్తేనే డిస్ర్టిబ్యూటర్లను సేఫ్‌ జోన్లోకి తీసుకురాగలుగుతుంది. మరి ధియేటర్లను బాగానే సర్దుబాటు చేశారు కాబట్టి.. పైగా ఆగస్టు 11న రిలీజ్ చేస్తే ఐదు రోజుల వీకెండ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి.. సినిమాకు అంత మొత్తం వసూలు చేయడం కష్టం కాకపోవచ్చు. కాని అదంతా కూడా హిట్ టాక్ వస్తేనే. ఏదేమైనా అదంతా కూడా బోయపాటి చేతుల్లోనే ఉంది. అతని రియల్ స్టామినా ఏంటనేది ఈ సినిమాతో ప్రూవ్ అవుతుంది.

నిజానికి ఇప్పటివరకు బోయపాటి పెద్ద పెద్ద స్టార్లతోనే పనిచేశాడు. రవితేజ.. వెంకటేష్‌.. బాలయ్య.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ ఇలా అందరూ కూడా సూపర్ స్టార్లే. ఫ్లాపు సినిమాలు తీసినా కూడా కోట్లలో వసూళ్ళు కురిపించే సత్తా ఉన్న స్టార్లు వారందరూ. అందుకే ఇప్పుడు మనోడు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న బెల్లంకొండ శ్రీనుతో ఎంత వసూలు చేయిస్తాడా అనే ఆతృత నెలకొని ఉంది. లెట్స్ గెట్ రెడీ ఫర్ నాయక!!