Begin typing your search above and press return to search.
బోయపాటి.. తడబడ్డాడా? నిజం చెప్పాడా?
By: Tupaki Desk | 26 April 2016 5:30 PM GMTదర్శకుడు బోయపాటి ఇచ్చిన స్పీచ్ ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. ఎవరూ బయటకు చెప్పని విషయాన్ని ఒకటి టక్కుమని చెప్పేసి.. తరువాత కవర్ చేసే ప్రయత్నం చేశాడా అనే సందేహం రాక మానదు. మనోడు నిన్న ''సరైనోడు'' సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. అసలు తడబడ్డాడా? లేక నిజం చెప్పాడా? అనే సందేహం తెప్పించేశాడు.
''లెజండ్ వంటి సినిమా తీసిన తరువాత.. ఈ సినిమా (సరైనోడు) నాకొక లైఫ్ అండ్ డెత్ లాంటిది'' అని చెప్పి.. ఒక పాజ్ ఇచ్చాడు. ''అదే నాకు ప్రతీ సినిమా కూడా మొదటి సినిమా లాంటిదే. ప్రతీదీ లైఫ్ అండ్ డెత్ లాగానే ట్రీట్ చేస్తా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడే బోయపాటిని సందేహించాల్సి వస్తోంది. నిజంగానే లెజండ్ సినిమా తీసిన తరువాత.. ఆ సినిమా బాలయ్య క్రేజ్ అండ్ జగపతి బాబు విలనీ వలనే ఆడిందంటూ చాలామంది కామెంట్లు చేశారు. అందుకే సరైనోడు సినిమా ఆడటం బోయపాటికి లైప్ అండ్ డెత్ వంటిదే. పైగా ఇతగాడికి పెద్ద హీరోలు ఎవ్వరూ సినిమా ఆఫర్ చేయకే.. బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాను మొదలెట్టాడనే రూమర్ కూడా ఉంది. మరి బన్నీ పిలిచి సినిమాను చేతిలో పెట్టాడు కాబట్టి.. ఖచ్చితంగా లైఫ్ అండ్ డెత్ రేంజులోనే ఫీలవ్వాల్సి వచ్చుంటుంది.
ఇక బోయపాటి మాత్రం.. ప్రతీ సినిమా లైప్ అండ్ డెత్ అంటూ అలా కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడులే. కాని మనోడి రేంజి టేకింగ్ కు.. కాస్త కథ కూడా ఉంటేనా.. సినిమాల సక్సెస్ రేంజు ఎక్కడికో వెళుతుంది.