Begin typing your search above and press return to search.
బాలయ్య-బోయపాటి సినిమా లేనట్టేనా..!
By: Tupaki Desk | 3 Jan 2016 9:38 AM GMTయువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ సినిమా డిక్టేటర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాలో నటించనున్నాడు. బాలకృష్ణ సన్నిహితుడు వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఈ సినిమాను సాయి నిర్మిస్తారని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ వందో సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించే ఛాన్సులు లేవా..మరో డైరెక్టర్ బాలకృష్ణ వందో సినిమాకు దర్శకత్వం వహిస్తారా అంటే ఫిల్మ్‌నగర్ నుంచి అవుననే సమాధానం వస్తోంది.
‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సినిమాల్లో బాలయ్యను శక్తిమంతమైన పాత్రల్లో చూపించి భారీ విజయాల్నిఅందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాని తెరకెక్కించి మరో హిట్ కొడతారని అభిమానులు ఆశపడ్డారు. అయితే ఆ కాంబినేషన్ ఇప్పట్లో సెట్టయ్యేలా లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ సినిమా (వర్కింగ్ టైటిల్ సరైనోడు)ను తెరకెక్కిస్తున్న బోయపాటి ఆ సినిమా తర్వాత మరో యంగ్ హీరోను డైరెక్ట్ చేయనున్నాడు. ‘అల్లుడు శీను’గా వెండి తెరమీదికి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండం సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ మూడో సినిమాకి బోయపాటి దర్శకత్వం వహించనున్నారు. నైజాంలో భారీ సినిమాలు పంపిణీ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ అధినేత నామా అభిషేక్ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ కాంబోలో తెరకెక్కే సినిమాతోనే అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ రంగలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ కూడా జరిగిపోయింది. బన్నీ-బోయపాటి సినిమా సమ్మర్ లో విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత ఏడాదిపాటు బోయపాటికి, బెల్లంకొండ శీను సినిమాతోనే సరిపోతుంది. ఈ లెక్కన చూస్తే బాలయ్య వందో సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోనుంది.