Begin typing your search above and press return to search.
న్యూ ఇయర్ పైనే బోయపాటి గురి
By: Tupaki Desk | 17 Dec 2020 4:40 PM GMTబోయపాటి సినిమా అనగానే తెరపై భారీ ఖర్చు కనిపిస్తుంది .. భారీ తారాగణం మెరుస్తుంది. ఆయన సినిమాల్లో ఫైటింగులు .. ఛేజింగులు ఒక రేంజ్ లో ఉంటాయి. హీరో కొట్టే ఒకే ఒక్క దెబ్బకి పదిమంది రౌడీలు గాల్లో పల్టీలు కొడుతూ ఎగిరిపడతారు. హీరో కత్తులతోనో .. కండబలంతోనో కాదు, పవర్ ఫుల్ డైలాగ్స్ తోనే చంపేస్తాడేమో అనుకునేంతగా హీరో క్యారెక్టర్ ను బిల్డప్ చేస్తాడు. ఈ కారణంగానే బోయపాటి సినిమాలను మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. హీరోతో ఆయన చెప్పించే డైలాగ్స్ కి వీలైనన్ని విజిల్స్ కొడతారు. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే అన్ని అంశాలు తన సినిమాలో ఉండేలా చూసుకోవడం బోయపాటి స్పెషాలిటీ.
అలాంటి బోయపాటికి 'సరైనోడు' తరువాత నుంచి నిరాశే ఎదురవుతూ వచ్చింది. ఆ సినిమా తరువాత ఆయన చేసిన 'జయ జానకి నాయక' .. 'వినయ విధేయ రామ' సినిమాలు భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఈ రెండు సినిమాల్లోను యాక్షన్ .. ఎమోషన్ హద్దులు దాటిపోయాయి. అసాధ్యాలను అవలీలగా చేయించి, అది హీరోయిజం ఖాతాలో వేయడానికి బోయపాటి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తెరపై అసలు కథకంటే హడావిడి ఎక్కువగా కనిపించడం ఆడియన్స్ కి నచ్చలేదు. దాంతో ఆ సినిమాలు ఫ్లాప్ అనిపించుకుని, బోయపాటి దూకుడికి బ్రేక్ వేశాయి.
ఈ రెండు సినిమాల్లో తాను చేసిన పొరపాటేమిటనే విషయం బోయపాటికి అర్థమైంది. దాంతో ఈ సారి ఆయన బాలకృష్ణతో చేసే కథ విషయంలో .. పాత్రలను డిజైన్ చేసే విధానంలో .. క్లైమాక్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. బాలకృష్ణ క్రేజ్ కి తగిన టైటిల్ ను నిర్ణయించనున్నట్టు ఇటీవల బోయపాటి చెప్పాడు. 'మోనార్క్' అనే టైటిల్ ను ఖాయం చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. వరుసగా రెండు భారీ ఫ్లాప్ లు ఇచ్చిన బోయపాటి, కొత్త ఏడాదిలో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు. చూడాలి మరి .. న్యూ ఇయర్ బోయపాటికి ఎంతవరకూ కలిసొస్తుందో.