Begin typing your search above and press return to search.

బోయపాటి రేంజ్ అంతకు పడిపోయిందా ?

By:  Tupaki Desk   |   6 May 2019 10:19 AM GMT
బోయపాటి రేంజ్ అంతకు పడిపోయిందా ?
X
సినిమా పరిశ్రమలో సక్సెస్ తర్వాతే ఏదైనా. అది ఉన్నంత కాలం అందరూ వెంటపడతారు. దూరమైన క్షణాన ఎంతో దగ్గర ఉన్న వారు సైతం శత్రువుల్లా మొహం చాటేస్తారు. ఇది ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా అందరికి వర్తించే వాస్తవం. ముఖ్యంగా దర్శకులకు. ఒక టైంలో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ ఏళ్ళు గడుస్తున్నా స్టార్ హీరోల పిలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళను లెక్కబెట్టడం కష్టం. అంత మందున్నారు.

ఇప్పుడు బోయపాటి శీను మరీ ఇంత కాదు కాని సంకట స్థితిలో అయితే ఉన్నాడు. బాలకృష్ణతో రేపో ఎల్లుండో షూటింగ్ మొదలవుతుంది అనుకుంటున్న తరుణంలో షాకిచ్చే విధంగా అనూహ్యంగా కెఎస్ రవికుమార్ ని లైన్ లోకి తేవడంతో బోయపాటి శీనుకు గట్టి స్ట్రోక్ తగిలింది. బాలయ్య మాట తప్పడు కాని ప్రస్తుతానికి సినిమా లేదన్న వాస్తవం మార్కెట్ లో బోయపాటి బ్రాండ్ మీద ప్రభావం చూపించక మానదు

ఈ నేపధ్యంలో దానికి ఎలాగూ టైం పడుతుంది కాబట్టి బోయపాటి వేరే హీరోతో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడట. దాదాపు అందరూ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆరెక్స్ 100 ఫేం కార్తికేయతో తన శిష్యుడు అర్జున్ జంధ్యాల రూపొందిస్తున్న సినిమా నిర్మాతలు తన స్నేహితులు కాబట్టి ఆ వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్న

బోయపాటి ఇదే హీరోతో ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇది నిజమో కాదో కాని మొత్తానికి ఈ ఆలోచన ధోరణి చూస్తే స్టార్ హీరోలతో నలభై కోట్లకు తక్కువ కాకుండా సినిమాలు చేసిన బోయపాటి ఇప్పుడు లిమిటెడ్ మార్కెట్ ఉన్న కార్తికేయతో చేస్తే మాత్రం రేంజ్ తగ్గిపోయిందా అనే కామెంట్స్ రాకపోవు. మరి శీను మనసులో ఏముందో వెయిట్ చేసి చూడాలి