Begin typing your search above and press return to search.

రామ్ ఫ్యాన్స్ కి బోయ‌పాటి స‌ర్ ప్రైజ్?

By:  Tupaki Desk   |   4 July 2022 11:30 PM GMT
రామ్ ఫ్యాన్స్ కి బోయ‌పాటి స‌ర్ ప్రైజ్?
X
క్రేజీ హీరో ఉస్తాద్ రామ్ న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా `ది వారియ‌ర్‌`. యాక్ష‌న‌ప్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుస్వామి ఈ మూవీని ఓకే సారి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ మొద‌లైంది. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ప‌వ‌ర్ ఫుల్ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా న‌టించింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ లో ఆది పాత్ర‌ని ప‌రిచ‌యం చేసిన తీరు, త‌ను చెబుతున్న డైలాగ్ లు.., రామ్ ప‌వ‌ర్ ఫుల్ ఎంట్రీ వెర‌సి సినిమాపై ఇప్ప‌టికే భారీ బ‌జ్ క్రియేట్ అయింది. జూలై 14న ఈ మూవీ భారీ స్థాయిలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత హీరో రామ్ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయ‌బోతున్నారు.

ఇటీవ‌లే ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

`అఖండ‌` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన బోయ‌పాటి శ్రీ‌ను.. హీరో రామ్ కోసం అదిరిపోయే స్టోరీని సిద్ధం చేయించాడ‌ట‌. అంతే కాకుండా ఈ మూవీతో రామ్ ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఇంత వ‌ర‌కు రామ్ క‌నిపించ‌ని విభిన్న‌మైన పాత్ర‌ల్లో అత‌న్ని చూపించ‌బోతున్నార‌ట‌.

ఈ మూవీలో రామ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని, రెండు పాత్ర‌లు కూడా చాలా డిఫ‌రెంట్ గా వుంటాయ‌ని, ఈ వార్త నిజంగా రామ్ ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజే అని చెబుతున్నారు. `అఖండ‌`లో బాల‌య్య‌ని డ్యుయెల్ రోల్ లో చూపించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న బోయ‌పాటి రామ్ మూవీని కూడా అదే పంథాలో తెర‌కెక్కించిన మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ని, త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలిసింది.