Begin typing your search above and press return to search.
ఆ సినిమా బాయ్ కాట్ కి చాలా కారణాలు చూపిస్తున్నారు
By: Tupaki Desk | 29 Aug 2022 5:48 AM GMTబాలీవుడ్ ను బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ భయపెడుతోంది. ఆ మధ్య వచ్చిన లాల్ సింగ్ చడ్డా తో పాటు పలు సినిమాలు కూడా బాయ్ కాట్ ప్రచారంను ఎదుర్కొని ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా లేదా ఫ్లాప్ టాక్ వచ్చినా బాయ్ కాట్ బ్యాచ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంటే ఈ బాయ్ కాట్ బ్యాచ్ తో భయం లేదు కానీ విడుదలకు ముందు వారు చేసే హడావిడి వల్ల సినిమాకు డ్యామేజ్ అవుతుందేమో అనే ఆందోళన కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో బ్రహ్మాస్త్ర పై అందరి దృష్టి ఉంది. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొంది విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా కి బాయ్ కాట్ దెబ్బ బలంగానే తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆలియా భట్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాత అవ్వడం... గతంలో రణబీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా విడుదల సమయంలో బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ కి కారణం అయ్యే అవకాశం ఉంది. అన్నింటి కంటే ప్రధానమైన విషయం ఏంటీ అంటే బ్రహ్మాస్త్ర సినిమా కథ మొదట దివంగత యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ వద్దకు వెళ్లిందట.
ఆయనకు పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేదనే ఉద్దేశ్యంతో కరణ్ జోహార్ ఈ సినిమా ను కపూర్ ఫ్యామిలీ హీరో కు ఇచ్చాడు అనేది విమర్శ.
ఆ కారణంగా కూడా బాయ్ కాట్ బ్యాచ్ కచ్చితంగా సినిమా ను బ్యాన్ చేయాల్సిందే అని.. బాయ్ కాట్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మాస్త్ర సినిమా చాలా పెద్ద కష్టాలను ముందు ముందు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.