Begin typing your search above and press return to search.

బాయ్ కాట్ అమెజాన్ హ్యాష్ ట్యాగ్ వైర‌ల్

By:  Tupaki Desk   |   6 Jun 2021 5:30 PM GMT
బాయ్ కాట్ అమెజాన్ హ్యాష్ ట్యాగ్ వైర‌ల్
X
అమెజాన్ ప్రైమ్ పేరు మార్మోగుతోంది. ఇటీవ‌ల ర‌క‌ర‌కాల వివాదాల‌తో నెట్ ఫ్లిక్స్ కి వ‌చ్చిన ప్రాచుర్యం వేరొక ఓటీటీకి రాలేదంటే అతిశ‌యోక్తి కాదు. కానీ ఇంత‌లోనే అమెజాన్ ప్రైమ్ రేసులోకి వ‌చ్చింది. గ‌డిచిన‌ రెండు సంవత్సరాలలో భారతీయ పౌరులతో బాగా క‌నెక్ట‌యిన ఓటీటీ వేదిక‌గా అమెజాన్ ప్రైమ్ కి గుర్తింపు ఉంది. ఇక తెలుగు ఆడియెన్ కోసం తెలుగు కంటెంట్ తో వ‌స్తూ ఎప్పుడూ రేసులో ముందుంది ప్రైమ్.

ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 1 అమెజాన్ ఫేట్ ని దేశంలో మార్చేసింది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 అమెజాన్ ఇమేజ్ ని పెంచుతోందే కానీ త‌గ్గించ‌లేదు. ఆరంభం వివాదాల‌తో మొద‌లైన ఈ సిరీస్ ని రికార్డ్ స్థాయిలో ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కుతోంది.

కానీ నెటిజన్ల నుండి కొన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. దీనికి కారణం సమంత న‌టించిన ఎల్‌.టి.టి.ఇ రెబ‌ల్ రాజీ పాత్ర‌తో కూడుకున్న ఎమోష‌న్ కార‌ణం. ఈలం త‌మిళుల్ని భారత వ్యతిరేకులుగా చూపించ‌డంతో త‌మిళ‌నాడులో ర‌గ‌డ మొద‌లైంది. చాలా మంది తమిళ ప్రజలు దీనిని ఏమాత్రం ఇష్టపడలేదు.

కాబట్టి ఇది #BoycottAmazon అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యేందుకు దారితీసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు సమంత న‌ట‌న‌కు అన్నివైపుల నుంచి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. మునుప‌టితో పోలిస్తే స‌మంత రెబ‌లియ‌న్ న‌ట‌న‌తో మెప్పు పొందుతోంది.