Begin typing your search above and press return to search.

వివాదంలో చ‌పాక్ .. దీపిక‌పై ఫ‌స‌క్

By:  Tupaki Desk   |   8 Jan 2020 6:52 AM GMT
వివాదంలో చ‌పాక్ .. దీపిక‌పై ఫ‌స‌క్
X
ఢిల్లీ జెఎన్ యూ లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై విద్యార్థులను బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకునే ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. దాడిని ఖండిస్తూ న‌లుపు రంగు దుస్తులు ధ‌రించి విద్యార్ధుల‌ తో భేటీ అయింది. వారికి సంఘీభావం తెలుపుతూ క్యాంప‌స్ లో హ‌ల్చ‌ల్ చేసింది. దీంతో దీపిక పై నెటిజ‌నులు మండి పడుతున్నారు. ఒక ర‌కంగా ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. దేశ ద్రోహుల‌పై ప్రేమ కురిపిస్తుందా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కన్న‌య కుమార్.. అయిషీ ఘోష్ వంటి వారికి దీప‌క మ‌ద్ద‌తు తెలిపింది. ఈ నేప‌థ్యం దాడిలో గాయ‌ప‌డిన‌ ఎబీవీపీ వాళ్ల సంగతేమిటి? న‌కిలీ ఫెమినిజం తో ఎన్నాళ్లు నెట్టుకొస్తావ్? ర‌ణ‌వీర్ ని పెళ్లాడి ఓ ఇంటిదాన‌వ‌య్యావు. స్టార్ గా వెలిగిపోతున్నావు. ఇలాంటి ప్ర‌చారం నీకు అవ‌స‌ర‌మా? అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

కేవ‌లం ఛ‌పాక్ సినిమాను నువ్వు సొంతంగా నిర్మించావు కాబ‌ట్టి ఈ త‌ర‌హా ప్ర‌చారానికి తెర లేపావ్? ఇలాంటి చిల్ల‌ర ప్ర‌చారంతో ఎలా ముందుకు వెళ్తావ్ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దేశంలో ఎంతో మంది ఎన్నో స‌మ‌స్య‌ల‌తో బాధ‌ ప‌డుతున్నారు. అందులో నిరు పేద‌ల ఆక‌లి స‌మ‌స్య భార‌త‌దేశంలో ప్ర‌ధాన‌మైన‌ది. పౌష్టికాహ‌ర స‌మ‌స్య‌తో ఎంతో మంది పిల్ల‌లు చ‌నిపోతున్నారు. దేశం రోగాల మ‌యం అయింది. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డానికి నీ విలువైన స‌మ‌యాన్ని కేటాయించ‌ని నెటిజ‌నులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో దీపిక అభిమానులు కూడా ఆమెకు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు.

దీపిక కోసం కాక‌ పోయిన నిజ‌మైన హీరోయిన్ ల‌క్ష్మీ అగ‌ర్వాల్ కోస‌మైనా సినిమా చూడాల‌ని కొంద‌రంటే...మ‌రికొంద‌రు ఛ‌పాక్ ని బాయ్ కాట్ చేయాలని హ్యాష్ ట్యాగ్ ని ట్విట‌ర్ ల్లో ట్రెండ్ చేస్తున్నారు. ఛ‌పాక్ రిలీజ్ కు ఇంకా రెండు రోజులే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఈ నెగిటివిటీ సినిమాపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుందోన‌ని బాలీవుడ్ మీడియా సైతం సందేహం వ్య‌క్తం చేస్తోంది. పాపం దీపిక ఎర‌క్క‌పోయి ఇరుక్కోంది.