Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ పైనే పంచ్ వేస్తావా.. నీ సినిమా బాయ్ కాట్!
By: Tupaki Desk | 5 Aug 2019 5:50 AM GMTఅదేంటో కానీ ఈమధ్య ప్రతి ఒక్కరికి మనోభావాలు ఏదో ఒక సందర్భంలో దెబ్బతింటూనే ఉన్నాయి.. గతంలో జనాలకు పెద్దగా మనోభావాలు ఉండేవి కాదేమో కానీ ఇప్పుడు మనోభావాలు వాటి చుట్టూ హంగామా ఎక్కువగా జరుగుతోంది. ఈ మనోభావాలు దెబ్బతినే ట్రెండ్ లో తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు జాయిన్ అయ్యారు. కారణం తమిళ సినిమా 'కోమాలి'.
టైటిల్ చూసి పొరపాటున అమ్మాయి పేరు కోమలి అనుకుంటారేమో.. కాదు అది 'కోమా-లి'. ఈ సినిమా ట్రైలర్ నిన్నే రిలీజ్ అయింది. థీమ్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ పై మాత్రం రజనీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈ సినిమాలో హీరో జయం రవి టీనేజ్ వయసులో ఒక ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్తాడు. పదహారేళ్ళ తర్వాత కొమానుంచి బయటకు వచ్చిన తర్వాత 'పదహారేళ్ళు కోమాలో ఉన్నావ్ రా' అని ఫ్రెండ్ చెప్తే అసలు నమ్మడు. అప్పుడు ఫ్రెండ్ యోగిబాబు సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ వీడియో చూపిస్తూ 'చూడు.. ఇది 2016' అంటాడు. అయితే జయం రవి "నేను నమ్మను.. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నాను అంటున్నాడంటే ఇది 1996" అంటాడు. ఈ పంచ్ డైలాగ్ ప్రేక్షకులకు భలే కనెక్ట్ అయింది. నిజంగానే గత ఇరవై ఏళ్ళుగా రజనీ రాజకీయాల్లోకి వస్తూ......నే ఉన్నాడు కదా.
అయితే ఈ విషయంపై సెటైర్లు వేయడం రజనీ ఫ్యాన్స్ కు మింగుడు పడలేదు.. 'కోమాలి' టీమ్ పై.. జయం రవిపై వారందరూ మండిపడుతున్నారు. అంతే కాదు '#బాయ్ కాట్ కోమాలి' అంటూ ఒక హ్యాష్ టాగ్ కూడా ట్రెండింగ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ మరో పదిరోజులే ఉండడంతో ఇది జయం రవి టీమ్ కు ఓ తలనెప్పిగా మారింది. జయం రవి ఫ్యాన్స్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా రజనీ అభిమానులు వినిపించుకోవడం లేదు. మరి 'కోమాలి' టీమ్ ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.