Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్
By: Tupaki Desk | 14 Oct 2022 4:44 PM GMT'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' మూవీ రివ్యూ
నటీనటులు: విశ్వంత్-మాళవిక-హర్షవర్ధన్-మధునందన్-రాజా రవీంద్ర-సుదర్శన్-శివన్నారాయణ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: బాల సరస్వతి
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి-వేణుమాధవ్ పెద్ది
రచన-దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
కేరింత, మనమంతా లాంటి చిత్రాలతో గుర్తింపు సంపాదించిన యువ నటుడు విశ్వంత్ ప్రధాన పాత్ర పోషించిన కొత్త సినిమా 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'. ఈ టైటిల్.. అలాగే ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అర్జున్ (విశ్వంత్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. అమ్మాయిలంటేనే కంగారు పడిపోయే అతను.. తన జీవితంలోకి రాబోయే అమ్మాయి విషయంలో చాలా గందరగోళంతో ఉంటాడు. అలాంటి టైంలోనే అతను అనుకోకుండా అమ్మాయిల సమస్యలు తీర్చే టెంపరరీ బాయ్ ఫ్రెండుగా మారతాడు. ఓవైపు అమ్మాయిల సమస్యలు తీరుస్తూనే.. తనకు కావాల్సిన లక్షణాలున్న అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. అప్పుడే దివ్య అనే అమ్మాయి అతణ్ని బాయ్ ఫ్రెండుగా హైర్ చేసుకుంటుంది. చివరికి తను కోరుకుంటున్న లక్షణాలున్న అమ్మాయి దివ్యనే అని అర్జున్ కు అర్థమవుతుంది. మరి తనతో అతడి ప్రయాణం ఎలా సాగింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్.. డబ్బులిస్తే తాత్కాలికంగా బాయ్ ఫ్రెండ్ లాగా నటించే కుర్రాడి కథ ఇదన్నమాట. ఈ టైటిల్ చూడగానే యువ ప్రేక్షకుల్లో కొంచెం క్యూరియాసిటీ కలిగే ఉంటుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందా.. దీని మీద సినిమానా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పాయింట్ ను ఎలా డీల్ చేసి ఉంటారో అన్న ఆసక్తి పుడుతుంది. ఐతే ఊరికే జనాల్ని ఆకర్షించడానికి ఇలా ఒక టైటిల్ పెట్టారే తప్ప.. తెరపై ఈ పాయింట్ ను ప్రెజెంట్ చేసే విషయంలో చిత్ర బృందం కాస్తయినా కసరత్తు చేయలేదని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టదు. ఒక పద్ధతైన కుటుంబంలో పుట్టి చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న కుర్రాడు.. ఆ ఉద్యోగం వదిలేసి మరి అద్దెకు బాయ్ ఫ్రెండ్ సేవలందించే కుర్రాడిగా మారాలంటే అందుకు బలమైన కారణం కనిపించాలి. అసలు బహిరంగంగా ఇలా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే.. ఈ విషయాన్ని కన్విన్సింగ్ గా చూపించకుంటే హీరో పాత్రతో.. ఈ కథతో ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఆ విషయంలో ఆరంభంలోనే నిరాశపరిచిన 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'.. ఆ తర్వాత కూడా అదే టెంపోతో సాగి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
తన జీవిత భాగస్వామిని వెతుక్కునే క్రమంలో అమ్మాయిలను ఎలా అప్రోచ్ కావాలో తెలియక సతమతం అయ్యే కుర్రాడు.. అందుకోసం అద్దె బాయ్ ఫ్రెండుగా మారడం అన్నది ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించని విషయం. అసలు ముక్కూ ముఖం తెలియని అమ్మాయిలకు బాయ్ ఫ్రెండుగా నటించి.. వాళ్ల నుంచి తనకు కావాల్సిన అమ్మాయి తాలూకు లక్షణాలను లిస్ట్ చేసుకోవడం అన్నదే సిల్లీగా అనిపిస్తుంది. తను చూసే అమ్మాయిల్లో నచ్చిన అమ్మాయి ఎవరో ఎంచుకోవడం ఒక పద్ధతి. అలా కాకుండా ఒక అమ్మాయిని చూసి ఆత్మాభిమానం.. ఇంకో అమ్మాయిని చూసి ధైర్యం.. మరో అమ్మాయిని చూసి స్పష్టత.. ఇలా ఒక్కో పాయింట్ నోట్ చేసుకుని ఇవన్నీ కలిపి ఉన్న అమ్మాయి కావాలి అంటూ చూడడం ఏంటో అర్థం కాదు. ఇలా లిస్టు రాసుకుని.. ఒక్కో క్వాలిటీ టిక్ పెట్టుకుని ప్రేమించడంలో లాజిక్ కనిపించదు. కాబట్టే సినిమాలో ఒక చోట హీరోయిన్ అన్నట్లు హీరో వ్యవహారం అంతా చాలా సిల్లీగా అనిపిస్తుంది.
హీరో అద్దెకు బాయ్ ఫ్రెండుగా మారడం అనే కాన్సెప్ట్ ను మొదలుపెట్టిన తీరులోనే ఆసక్తి సన్నగిల్లిపోగా.. ఆ తర్వాత అతను చేసే పనులు కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ గా సాగవు. ఇక కథానాయిక అతణ్ని హైర్ చేసుకోవడం.. ఆ తర్వాత ఆమే తాను కోరుకుంటున్న అమ్మాయి అని హీరో గుర్తించి తనకు ఐలవ్యూ చెప్పడం ఇదంతా కూడా చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర హీరోయినే అతణ్ని ప్లాన్ చేసి ప్రేమలోకి దించిందని తెలిసి.. ఇదేదో పెద్ద ట్విస్టులా ఉందే అన్న క్యూరియాసిటీ కలుగుతుంది. కానీ తర్వాత అసలు విషయం తెలిసి ఉస్సూరుమంటాం.
హీరోయిన్ అసలు హీరోను ఎందుకు ప్రేమిస్తుందో.. అంత ప్లాన్ చేసి అతణ్ని ప్రేమలోకి దించేలా తనలో ఏముందో అసలర్థం కాదు. ఎలాగోలా ఈ కథ సుఖాంతం అవుతోందిలే అనుకుంటే హీరో చెప్పిన లక్షణాలు తనలో లేవంటూ ఆమె టెన్షన్ పడడం.. అతణ్ని దూరం పెట్టడం.. ఈ క్రమంలో నడిచే డ్రామా చాలా బోరింగే. హీరోయిన్ ఏదైనా తప్పు చేసి ఉంటే.. ఆమెలో ఏదైనా లోపం ఉంటే.. దాని మీద డ్రామా నడిపితే ఓకే కానీ.. ఇలా ధైర్యంగా ఉండడం.. లైఫ్ విషయంలో క్లారిటీతో ఉండడం లాంటి హీరో రాసుకున్న క్వాలిటీస్ హీరోయిన్లో లేకపోవడం పెద్ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ కావడం అన్నది సిల్లీతనానికి పరాకాష్ట. బలవంతంగా ఈ కథను మలుపు తిప్పి.. చివర్లో హీరో హీరోయిన్లను కలపడానికి చేసిన ప్రయత్నం కూడా ఏమాత్రం ఆసక్తికరంగా లేదు.
నటీనటులు:
అద్దెకు బాయ్ ఫ్రెండుగా నటించే పాత్రలో విశ్వంత్ పర్వాలేదనిపించాడు. తన పాత్రలో క్లారిటీ లేకపోవడం వల్ల విశ్వంత్ సైతం చాలా చోట్ల అయోమయంగా కనిపించాడు. ఈ చిత్రంలో విశ్వంత్ చూడ్డానికి బాగున్నాడు తప్పితే నటన పరంగా అంత ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేకపోయింది. హీరోయిన్ మాళవిక పర్వాలేదు. సినిమాలో హీరో మాదిరి చూడగానే మైమరిచిపోయేంత అందగత్తె కాదు తను. విశ్వంత్ పక్కన ఆమె కొంచెం పెద్దదానిలా కనిపిస్తుంది. తన నటన ఓకే అనిపిస్తుంది. సహాయ పాత్రల్లో హర్షవర్ధన్.. మధునందన్.. శివన్నారాయణ.. రాజా రవీంద్ర తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
గోపీసుందర్ ఈ సినిమాకు పాటలు అందించాడని తన పేరు చూసే వరకు నమ్మకం కలగదు. ఇంతకుముందు అతను తెలుగులో సంగీతం అందించిన చిత్రాలకు.. దీనికి అసలు పోలికే లేదు. ఒక్క పాటలోనూ గోపీ ముద్ర కనిపించదు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. బాలమురళి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ సంతోష్ కంభంపాటి ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం తేలిపోయింది. స్క్రిప్టు దగ్గరే ఫెయిలైనట్లుగా అనిపించే ఈ సినిమా.. తెర మీద ఏమాత్రం కూడా ఏమాత్రం మెరుగుపడలేదు.
చివరగా: బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్.. ఇంట్రెస్టింగ్ పాయింట్-సిల్లీ ప్రెజెంటేషన్
రేటింగ్-1.5/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre