Begin typing your search above and press return to search.

బోయ్ ఫ్రెండ్ ని అణుక్ష‌ణం నీడ‌లా వెంటాడుతోంది!

By:  Tupaki Desk   |   3 March 2021 4:30 AM GMT
బోయ్ ఫ్రెండ్ ని అణుక్ష‌ణం నీడ‌లా వెంటాడుతోంది!
X
ఆ ఇద్ద‌రికీ ల‌వ్ బ్రేక‌ప్ అయ్యింది. కానీ ఆ త‌ర్వాతా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఇద్ద‌రి స్నేహం నిరంత‌రం చ‌ర్చ‌ల్లో ఉంటుంది. ముఖ్యంగా ముంబై మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక క‌థ‌నం వెలువ‌డుతూనే ఉంటుంది. ఇంత‌కీ ఈ ఎక్స్ ప్రేమికులు ఎవ‌రో చెప్పాల్సిన ప‌నే లేదు. దిశాప‌టానీ- టైగ‌ర్ ష్రాఫ్ జంట గురించే ఇదంతా.

నేడు టైగ‌ర్ ష్రాఫ్ 31వ పుట్టినరోజు వేడుక‌ల్లో దిశా ప‌టానీ ప్ర‌త్య‌క్ష‌మైంది. బ‌ర్త్ డే వేడుక‌ల అనంత‌రం వీరిద్దరూ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ‌లోని రెస్టారెంట్ ‌లో భోజనం చేశారు. టైగర్ ష్రాఫ్ తల్లి ఆయేషా కూడా కాంప్లెక్స్ నుండి బయటకు వస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

ప్ర‌స్తుతం పుట్టినరోజు విందులో టైగర్ - దిషా పటానీ జంట‌గా ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైరల్ అవుతున్నాయి. టైగర్ ష్రాఫ్ పుట్టినరోజున అర్ధరాత్రి గ‌డియారం ముళ్లు 12 అంకెను తాక‌గానే... టైగ‌ర్ త‌ల్లిగారు కొన్ని ఫోటోల్ని ఇన్ స్టాలో అప్ లోడ్ చేశారు. దేవుడు నిన్ను ఎప్పుడూ నా ప్రియమైన కొడుకుగా ఆశీర్వదిస్తాడు అని టైగర్ ష్రాఫ్ కి ఆమె పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దిశా పటానీ త‌న స్నేహితుడికి ప్రేమ‌పూర్వ‌క బ‌ర్త్ డే విషెస్ తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. టైగర్ న‌టించిన బాఘి 3 లో దిశా ఒక ఐటెమ్ నంబ‌ర్ లో క‌నిపించింది. ఇందులో శ్రద్ధా కపూర్ - రితీష్ దేశ్ ముఖ్ లతో కలిసి టైగ‌ర్ నటించారు. దిశా న‌టించిన రాధే ఈద్ కానుక‌గా రిలీజ్ కానుంది. స‌ల్మాన్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. మ‌రోవైపు టైగ‌ర్ ష్రాఫ్ ప‌లు భారీ చిత్రాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నాడు.