Begin typing your search above and press return to search.
విడాకుల తర్వాత 60 కోట్లిచ్చా: హీరో
By: Tupaki Desk | 9 Aug 2018 3:34 PM GMTఏంజెలీనా జోలి-బ్రాడ్ పిట్.. హాలీవుడ్ ఫేమస్ సినీ జంట.. ఈ అగ్ర హీరో హీరోయిన్లు దాదాపు 11 ఏళ్లపాటు సహజీవనం చేసి 2014లో ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. అనంతరం పెళ్లైనా రెండు సంవత్సరాలకే తీవ్రమైన విభేదాలతో విడిపోయారు. ఈ బాధలో ఏంజెలీనా జోలీ హాలీవుడ్ లో సినిమాలు కూడా తగ్గించేసింది. ఏంతో క్రేజ్ ఉన్న ఈమె ప్రస్తుతం తన మాజీ మొగుడు బ్రాడ్ పిట్ ను బజారుకీడ్చింది.
ఏంజెలినా జోలి ఇటీవలే బ్రాడ్ పిట్ పై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విడాకుల అనంతరం పిల్లల సంరక్షణకు బ్రాడ్ పిట్ తగినంత ఆర్థిక సాయం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై బ్రాడ్ పిట్ కూడా తీవ్రంగా స్పందించాడు. తాను పిల్లల సంరక్షణం కోసం ఇప్పటికే ఏంజెలినా జోలికి 60 కోట్లు ఇచ్చానని.. పబ్లిసిటీ కోసమే తనను బజారుకీడ్చాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇచ్చిన 60 కోట్లతో ఏంజెలీనా విలాసవంతమైన ఇళ్లు కొన్నదని.. ఆ ఇంటికి 54 కోట్ల వ్యయం అయ్యిందని.. డబ్బులు అయిపోగానే మళ్లీ తన మీద కేసు వేసిందని మండిపడ్డారు. ఇలా 13 ఏళ్లు కలిసి కాపురం చేసిన ఈ జంట డబ్బుల కోసం కొట్టుకోవడం ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.