Begin typing your search above and press return to search.
తుపాకీతో పవన్ రచ్చ రచ్చే..
By: Tupaki Desk | 29 March 2016 6:28 AM GMTఈ సినిమాలో బోలెడన్ని గన్నులుంటాయ్ అని చెబితే చాలు పవన్ కళ్యాణ్ తో సినిమా ఓకే అయిపోతుందంటూ పూరి జగన్నాథ్ ఓసారి చమత్కరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పవన్ సినిమాల్ని గమనిస్తే అతడికి గన్నుల మీద ఉన్న మోజేంటో అర్థమవుతుంది. అందులోనూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రోమోస్ చూస్తుంటే పవన్ గన్నుల పిచ్చి పీక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. ఏకంగా ఈ సినిమాలో 700 తుపాకులు వాడటమే అందుకు నిదర్శనం. ఐతే ఈ తుపాకులన్నీ ఎక్కడో మార్కెట్లో కొనుక్కుచ్చినవేమీ కావు. పూర్తిగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి నేతృత్వంలో తయారు చేసినేనట ఈ గన్నులన్నీ.
‘సర్దార్ గబ్బర్ సింగ్’లో పవన్ గన్నుల్ని ఏ రేంజిలో వాడతాడు అన్నది మేకింగ్ వీడియో.. టీజర్, ట్రైలర్ అన్నింట్లోనూ కనిపించాయి. మేకింగ్ వీడియో అయితే దాదాపుగా అంతాపవన్ గన్ను వాడకంమీదే సాగింది. ఓ సీన్లో గన్నుతో రొమాన్స్ కూడా చేస్తూ కనిపించాడు పవన్. పవన్ వాడే గన్ను చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నాడు బ్రహ్మ. ‘సర్దార్..’ సినిమాకు మిగతా ఆర్ట్ వర్క్ అంతా ఒకెత్తయితే గన్నుల తయారీ మరో ఎత్తని అంటున్నాడతను. సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ పవన్ గన్నుతో కనిపిస్తాడట. సినిమాలో బ్రహ్మానందం తుపాకులు అమ్మే దుకాణం నడుపుతుంటాడట. పవన్-బ్రహ్మి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని.. ‘గబ్బర్ సింగ్’లో కంటే కూడా ఇందులో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా పండిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.