Begin typing your search above and press return to search.
రవితేజ.. కృష్ణవంశీ అలాంటి కష్టాలు పడ్డారట!
By: Tupaki Desk | 16 Aug 2022 11:30 PM GMTఇప్పుడంటే ఇండస్ట్రీ దృష్టికి తమ టాలెంటును తీసుకుని వెళ్లడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం అందరూ ఆఫీసుల చుట్టూ తిరగవలసిందే. తమ ఫొటోల ఆల్బమ్ పట్టుకుని 'ఒక్క ఛాన్స్ ప్లీజ్' అంటూ అడిగవలసిందే. అలా ఇండస్ట్రీ చెన్నైలో ఉండగా అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లినవారిలో బ్రహ్మాజీ ఒకరు. 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఆయన మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
"చెన్నైలో ఒక అపార్టుమెంటు ఉండేది .. మొత్తం వంద రూములు ఉండేవి. సినిమా ఛాన్సుల కోసం వచ్చిన వాళ్లంతా దాదాపు అక్కడే ఉండేవారు. ఒక రూములో ఇద్దరు మాత్రమే ఉండటానికి వీలుండేది. నెల వచ్చేసరికి మనిషికి 125 రూపాయలు రెంట్ కట్టవలసి వచ్చేది.
నాతో పాటు కొంతకాలం పోసాని కూడా ఉన్నాడు. అలా సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలోనే నాకు కృష్ణవంశీ తారసపడ్డాడు. అలా మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వర్మ 'శివ' సినిమా చేస్తున్న సమయంలో ఆయనను కృష్ణవంశీ కలవాలనుకున్నప్పుడు కూడా నా బైక్ పైనే తీసుకుని వెళ్లాను.
ఒక రోజున నేను భోజనం చేస్తుండగా కృష్ణవంశీ వచ్చాడు .. 'రా భోజనం చేయి' అంటే వచ్చి కూర్చున్నాడు. ఇద్దరం కలిసి భోజనం చేశాము. ఆ తరువాత తెలిసింది తాను భోజనం చేయక రెండు రోజులు అయిందని.
నేను భోజనం పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకుని అందరితో చెప్పడం గొప్ప విషయం. ఏకంగా నన్ను హీరోగా పెట్టేసి 'సిందూరం' సినిమా చేయడం మరో విశేషం. ఆర్ధికంగా నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదుగానీ .. కృష్ణవంశీ చాలా కష్టాలు పడ్డాడు .. అలాగే రవితేజ కూడా.
రవితేజ కూడా ముందుగా నటుడిగా ట్రై చేశాడు. ఎక్కడా అవకాశాలు రాకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిపోయాడు. ఆ తరువాత కెమెరా ముందుకు రావడం జరిగింది. నేను నిలకడగా .. నిదానంగా ముందుకు వెళ్లాను. కృష్ణవంశీ .. రవితేజ ఇద్దరూ కూడా రిస్క్ తీసుకుని దూకుడుగా ముందుకు వెళ్లారు. అందువల్లనే చాలా ఫాస్టుగా వాళ్లు దూసుకుపోయారు. నేను మాత్రం ఇప్పటికీ పద్ధతిని ఫాలో అవుతూ వెళుతున్నాను. కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీగానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.