Begin typing your search above and press return to search.
కృష్ణవంశీని బెదరగొట్టిన బ్రహ్మాజీ దేనికంట?
By: Tupaki Desk | 13 Aug 2022 4:30 PM GMTప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా..సహ నటులుగా చెలామణి అవుతోన్న వారిలో దాదాపు చెన్నై లో ఉండి ప్రయత్నించి సక్సెస్ అయిన వారే. సీనియర్ నటులంతా అక్కడి బ్యాచ్ నే. అలాంటి గ్యాంగ్ లు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి రవితేజ..కృష్ణవంశీ..బ్రహ్మాజీ ఒకరు. ముగ్గురు ఒకేసారి ఇండస్ర్టీకి వచ్చారు.
అందులో ఇద్దరు నటులుగా కాగా..కృష్ణ వంశీ పెద్ద డైరెక్టర్ అయ్యాడు. బ్రహ్మాజీ టాలీవుడ్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు. అన్నగా..తమ్ముడిగా..విలన్ గా ఎన్నో ప్రాతలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలు కొన్నింటిని స్మరించుకున్నారు.
..నేను పరిశ్రమకి వచ్చి 28 ఏళ్లు అవుతుంది. ఓ నటుడికి.. ఐఏఎస్ కి..ఐపీఎస్ కి ఇచ్చినంత గౌరవం ఇస్తున్నారు. నటులుగా మాకు మాత్రమే దక్కిన అదృష్టం ఇది. ప్రయత్నించిన వారందరికీ అవకాశాలు రావు. దానికి టైమ్ కూడా కలిసి రావాలి. అలా ప్రయత్నించి అవకాశం అందుకుని పైకొచ్చాం. చాలా సంతోషంగా ఉంటుంది. సక్సెస్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు.
అది విజేతగా నిలిచిన వాళ్లకి...ప్రయత్నాలు చేసిన వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ కంటే సెకాండాఫ్ బాగుండాలని కోరుకుంటాం. కర్మ సిద్దాంతం అనేది ఒకటుంటుంది. మనం ఎంత డ్రా చేసుకోవాలో అంతే డ్రా చేసుకుని వెళ్తాం. నాకు పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. కృష్ణగారికి వీరాభిమానిని. రవితేజ నేను..చెన్నై బ్యాచ్. చాలా స్ర్టగుల్స్ పడ్డాం. అంతా సాయంత్రం కలిసే వాళ్లం. నాకు మొదటి ఛాన్స్ ఇచ్చింది కృష్ణ వంశీ. వాడు భవిష్యత్ డైరెక్టర్ అవుతాడని..నన్ను పెట్టుకుంటే నీకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని..పెద్ద డైరెక్టర్ అవుతావని వంశీని తెగ బెదరగొట్టేవాడిన..న్నారు.
ఇంకా పెళ్లి విషయాలు పంచుకుంటూ .. నాది లవ్ మ్యారేజ్ . బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఇంట్లో తమిళం..ఇంగ్లీష్ రెండు మాట్లాడుతాం. ఫ్యామిలీ లైఫ్ అంతా సంతోషంగా ఉంద.న్నారు. రాజకీయ పార్టీలు అవ్వొచ్చు. వేరే అభిమానులు అవ్వొచ్చు. కొందరు లెజెండ్స్ ఉన్నారు. అంతా కలిసి గౌరవించుకోవాలి. నెగిటివ్ గా వెళ్లకూడదు.
కొందరు ఆర్టిస్టులు ఎన్నికల సమయంలో టీవీలో కనిపించడం కోసం వస్తుంటారు. ఆ తర్వాత కనిపించరు. వారంతా ఎలాగూ సినిమాల్లో ఉండరు. నాకు రాజకీయాలంటే ఇష్టం ఉండదు. ఎలాగూ వాటి జోలికి వెళ్లను. ఎక్కడికక్కడ రొచ్చా అంటూ వ్యాఖ్యానించారు. ఆ షోకి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్ అందుబాటులోకి వస్తే మరిన్ని విషయాలు తెలియడానికి ఛాన్స్ ఉంది.