Begin typing your search above and press return to search.

సామ్ రూ.250 కోట్ల భరణంపై ఓపెన్ అయిన సీనియర్ నటుడు

By:  Tupaki Desk   |   24 Aug 2022 5:06 AM GMT
సామ్ రూ.250 కోట్ల భరణంపై ఓపెన్ అయిన సీనియర్ నటుడు
X
సోషల్ మీడియా పుణ్యమా అని గాలిని మూటలు కట్టేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అబద్ధాన్ని నిజంలా.. అచ్చుగుద్దినట్లుగా తయారు చేసే వాట్సాప్ యూనివర్సిటీలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సోషల్ మీడియా వర్సిటీలు పోటీ పడుతున్నాయి. ప్రముఖల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఇష్యూలు తెర మీదకు వచ్చిన వేళ.. వాస్తవానికి భిన్నంగా అసలు వాస్తవం ఇదే బాస్ అన్న భావన కలిగేలా చేస్తూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో కొందరు అతిగాళ్లు కీ రోల్ ప్లే చేస్తుంటారు.

అలాంటి వాదనలు జనాల మెదళ్లలో చేరిపోయిన వేళ.. అసలు జరిగింది ఇది అంటూ కొందరు ప్రముఖులు క్లియర్ చేసే బాధ్యను తీసుకోవటం కొంతలో కొంత మంచి పరిణామంగా చెప్పక తప్పదు. నాగచైతన్య.. సమంత విడాకుల వ్యవహారంలో 'రూ.250 కోట్ల భరణం' ఎపిసోడ్ ఎంత హాట్ టాపిక్ గా మారింది.

ఈ సందర్భంగా పలువురు సమంతను టార్గెట్ చేయటం.. ఆమెను దారుణంగా ట్రోల్ చేయటం తెలిసిందే. జరిగిపోయిన ఈ ఎపిసోడ్ మీద సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక విషయాల్ని వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని ప్రస్తావించి.. చెప్పిన మాటలు ఆసక్తికరంగానే కాదు.. అసలు విషయం ఏమిటన్నది అర్థమయ్యేలా ఉంది.

తానుఅన్ని విషయాల్లో దూరనని.. కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నోరు మెదుపుతానన్న ఆయన.. ''సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నాగచైతన్య దగ్గరి నుంచి రూ.250 కోట్లు భరణం తీసుకొని గేమ్ ప్లే చేశావు. నువ్వో సెకండ్ హ్యాండ్' అని చాలా ఛండాలంగా మాట్లాడాడు. దానికి సమంత రిప్లై ఇచ్చింది. ఆ సందర్భంగా అతడి మాటలు తనకు కోపం వచ్చి తానూ మాట్లాడినట్లు చెప్పాడు.

'నీకు సిగ్గు.. శరం లేదు. నువ్వు థర్డ్ గ్రేడ్. అమ్మాయి వ్యక్తిగత విషయంలో నీకేంటి సంబంధం? సమంత ముఖం చూడాలన్నా.. ఆమెతో మాట్లాడాలన్నా దాదాపు పదేళ్లు పడుతుంది. సోషల్ మీడియా కారణంగా ఆమెతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంతోషపడు.

సరదాగా అమ్మాయిని పొగుడు. యాక్టింగ్ నచ్చకపోతే చెప్పు. అంతేకానీ వ్యక్తిగత విషయం గురించి మాట్లాడేందుకు నువ్వు ఎవరు?'' అని ప్రశ్నించారు. ఆ దెబ్బతో ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి మళ్లీ అలాంటి కామెంట్ చేయలేదన్నారు. దారుణంగా కామెంట్ చేసిన వ్యక్తిని సమంత ఫ్రెండ్స్ కూడా రియాక్టు కాలేదని.. తాను మాత్రం అయినట్లు చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ.