Begin typing your search above and press return to search.
కృష్ణవంశీ అది బాగా గుర్తుంచుకున్నాడు
By: Tupaki Desk | 25 Jan 2018 1:32 PM GMTసినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం అంటే ఎంత కష్టమైనా పనో అప్పటి తారలను అడిగితే తెలుస్తుంది. చెప్పులు అరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగితే గాని చిన్న వేషం దక్కేది కాదు. ఆకలి బాధలతో అలసటతో పైకొచ్చిన నటీనటులు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో బ్రహ్మాజీ ఒకరు. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో సహనటుడిగా వర్క్ చేసిన బ్రహ్మాజీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కెరీర్ మొదట్లో కొన్ని విషయాల గురించి వివరించాడు.
ముఖ్యంగా కృష్ణవంశీతో చాలా క్లోజ్ గా ఉండే బ్రహ్మాజీ ఒకసారి ఆయనతో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. బ్రహ్మజీ మాట్లాడుతూ..కృష్ణవంశీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అతను పస్తులుంటాడు కానీ ఎవరినీ అడగడానికి ఇష్టపడడు. చేయి చాచి అడగడు. అదే కృష్ణవంశీ క్యారెక్టర్. ‘నేను ఇబ్బందుల్లో ఉన్నా’ అని కూడా ఎవ్వరికి చెప్పుకోడు. చాలా గట్స్ ఉన్న వ్యక్తి. అయితే ఒకసారి మేము అలా కంటిన్యూగా టైమ్ చూసుకోకుండా మాట్లాడుకుంటున్న సమయంలో నైట్ అవ్వగానే నాకు ఆకలేసింది. వెంటనే వంశీని భోజనానికి వెళదామని చెప్పాను . అప్పుడే తెలిసింది అతను భోజనం చేసి రెండు రోజులవుతోందని..
అలా పరిస్థితులు ఎదురవ్వడంతో ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నాడట - కానీ మరొక రోజు అని ప్రయత్నం చేసి అనుకున్నది సాధించాడు - ఇక నన్ను ఆ విధంగా గుర్తు పెట్టుకొని తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి చివరికి హీరోగా కూడా అవకాశం ఇచ్చాడని బ్రహ్మాజీ వివరించాడు.