Begin typing your search above and press return to search.
ప్రభుత్వ సంస్థపైనే నటుడు బ్రహ్మాజీ సెటైర్లు.. కారణం ఇదీ
By: Tupaki Desk | 30 Aug 2022 9:30 AM GMTప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ హర్ట్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ హాస్య నటుడు కమెడియన్ గానే కాదు.. విలనిజం కూడా పండిస్తుంటాడు. ఎక్కువగా హీరోలకు సపోర్టింగ్ రోల్స్ చేస్తుంటాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాడు. రకరకాల పాత్రలు పోషిస్తున్నాడు.
బ్రహ్మాజీ తమ పక్కన నటించిన సినిమాలన్నీ హిట్ అని మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా కొందరు హీరోలు సెంటిమెంట్ గా భావిస్తారు. అందుకే అతడిని తమ పక్కనపెట్టుకుంటారు.
బ్రహ్మాజీకి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. సమయం దొరికితే చాలు ప్రపంచదేశాలన్నీ చుట్టివస్తుంటాడు. తన సంపాదన అంతా కూడా ట్రావెలింగ్ కోసం ఖర్చు పెడుతాడని.. తాను డబ్బు కూడబెట్టుకోనని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. తన ఫ్యామిలీతో ఎక్కువగా విదేశీ పర్యటనలకు వెళుతానని తెలిపాడు.
తాజాగా బ్రహ్మాజీ చండీగఢ్ నుంచి కులుమనాలికి విమానంలో వెళ్లేందుకు సిద్ధం కాగా ఈ ఫ్లైట్ ఆలస్యం అని చెప్పారట.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదున్నర గంటలు ఆలస్యంగా ఆ విమానం వచ్చిందట.. సదురు విమానయాన సంస్థ నుంచి ఎలాంటి సమాచారం కూడా ప్రయాణికులకు ఇవ్వలేదట.. వెయిట్ చేసినా కనీసం ప్రయాణికులకు సారీ చెప్పలేదని బ్రహ్మాజీ వరుస ట్వీట్లు పెడుతూ మండిపడ్డారు.
చివరకు ఐదున్నర గంటల ఆలస్యంగా ఫ్లైట్ వచ్చిందని.. ఇప్పుడు చేరుకున్నాడనని.. బ్రహ్మాజీ ఫొటో షేర్ చేసి మండిపడ్డారు. ఇది ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా సంస్థ కాబట్టి ఇలా ఎవరూ స్పందించడం లేదని ట్వీట్ లో బ్రహ్మాజీ సెటైర్లు వేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.