Begin typing your search above and press return to search.

పడవ కొనాలనుకుంటున్నా.. సలహా ప్లీజ్: బ్రహ్మాజీ

By:  Tupaki Desk   |   19 Oct 2020 8:00 PM IST
పడవ కొనాలనుకుంటున్నా.. సలహా ప్లీజ్: బ్రహ్మాజీ
X
ఏకధాటిగా కురిసిన భారీ వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. కాలనీలన్నీ మునిగిపోయాయి. జనాలంతా అతలాకుతలం అయ్యారు. చాలా మంది ఇండ్లు నీట మునిగి నానా అగచాట్లు పడ్డారు.

అయితే ఇప్పటికీ కూడా హైదరాబాద్ ను వర్షాలు వదలడం లేదు. ఇప్పటికే 30మందికి పైగా వర్షాలకు మరణించారు. సోషల్ మీడియాలోనూ హైదరాబాద్ లో వర్షాలపై నెటిజన్లు రోజుకో సెటైర్లు వేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తూ పరిస్థితిని కళ్లకు కడుతున్నారు.

తాజాగా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఈ హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు. హైదరాబాద్ వరదల్లో తన ఇల్లు కూడా మునిగిందని తెలిపిన బ్రహ్మాజీ ఈ మేరకు తన ఇంటి ఫొటోలు.. ఇంటి ముందర మునిగిన కార్ల ఫొటోలను షేర్ చేశాడు.

‘ఓ మోటార్ బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి చెప్పండి ప్లీజ్’ అని బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు కొందరు పాజిటివ్ గా.. మరికొందరు నెగెటివ్ గా స్పందిస్తున్నారు.