Begin typing your search above and press return to search.
బ్రహ్మాజీ తనయుడు పిట్ట కథ చెబుతాడా?
By: Tupaki Desk | 27 Jan 2020 6:06 AM GMTసినీ పరిశ్రమ లో వారసుల వెల్లువ అంతకంతకు పెరుగుతోంది. హీరోలు.. క్యారెక్టర్ ఆర్టిస్టుల వారసులు బరిలో దిగుతున్నారు. ఆసక్తికరంగా ఎవరు పరిచయం అయినా హీరో అవ్వాలన్నదే కోరిక. అయితే అలా వచ్చినవాళ్లలో సక్సెసైంది చాలా తక్కువమంది. సక్సెస్ కాని వాళ్లు వేరే రంగాల్లో స్థిర పడుతున్నారు. తాజాగా నటుడు బ్రహ్మాజీ వారసుడు టాలీవుడ్ లో ప్రవేశిస్తున్నాడు. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమవుతున్నాడు. ఆ బాధ్యతల్ని భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద్ ప్రసాద్ కి అప్పజెప్పారు.
వివరం లోతుల్లోకి వెళితే.. బ్రహ్మాజీ తనయుడి పేరు సంజయ్. `ఓ పిట్ట కథ` చిత్రం తో హీరో అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా రిలీజ్ చేయడంతో అసలు సంగతి బయటకు వచ్చింది. సంజయ్ కోసం కాన్సెప్ట్ బేస్ట్ స్టోరీ ని బ్రహ్మాజీ ఎంపిక చేశారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మూవీ ఆద్యంతం రక్తి కట్టిస్తుందని యూనిట్ తెలిపింది. ఈ సినిమా తో చెందు ముద్దు అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. ఇందులో నిత్యా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వంత్- బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఓ పిట్ట కథ టైటిల్ ఎంపిక చేసుకోవడానికి కారణాల్ని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. దర్శకుడు స్టోరీ నేరెట్ చేసేటప్పుడు చాలా ఆసక్తిని రేకెత్తించింది. తనే రెండు మూడు టైటిల్స్ చెప్పాడు. కానీ ఈ కథకి ఓ పిట్ట కథ అనే టైటిల్ పర్ పెక్ట్ గా యాప్ట్ అవుతుందని ఎంపిక చేశాం అని నిర్మాతలు చెబుతున్నారు. `ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ` అనే ఉప శీర్షిక నేను ఎంపిక చేసినదేనని నిర్మాత ఆనంద ప్రసాద్ తెలిపారు. కథకు బాగా కనెక్ట్ అవ్వడం తోనే నిర్మాణ బాధ్యతల్ని చేపట్టాను. ఆడియన్స్ కూడా నచ్చే సినిమా అవుతుంది. టైటిల్ కు పరిశ్రమ నుంచి టైటిల్ కి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని ఆనంద ప్రసాద్ సంతోషం వ్యక్తం చేసారు.