Begin typing your search above and press return to search.
వైరల్ గా బ్రహ్మాజీ ట్వీట్... టీడీపీని తారకే ఆదుకోవాలట
By: Tupaki Desk | 23 May 2019 2:34 PM GMTసార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విపక్ష వైసీపీ బంపర్ మెజారిటీతో దూసుకుపోతోంది. ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత సాధించిన వైసీపీ... ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి విజయం, మరో పార్టీకి అపజయం సాధారణమే అయినా... ఇప్పుడు వైసీపీ కొట్టిన దెబ్బకు మూడున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన టీడీపీ గుల్ల గుల్ల అయిపోయింది. మొత్తం 175 సీట్లున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా 150 స్థానాలను దక్కించుకునే దిశగా దూసుకుపోతుంటే... అదికార పార్టీగా ఉన్న టీడీపీ 25 సీట్లకు పరిమితయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇక టీడీపీ బతికి బట్ట కట్టడం దాదాపుగా అసాధ్యమన్న రీతిలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఆసక్తికరంగా స్పందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన మోదీతో పాటు జగన్ కు కూడా శుభాకాంక్షలు చెబుతూనే ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘ఇక మా తారకరాముడే ఆదుకోవాలి‘ అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఎన్నికల్లో టీడీపీకి దక్కిన ఓటమిని గుర్తు చేసుకుంటూ... ఇక టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదన్న భావనను ఆయన వ్యక్తం చేసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపీకి పునరుజ్జీవం రావాలంటే... భవిష్యత్తులో ఆ పార్టీ కొనసాగాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగక తప్పదన్న భావన వచ్చేలా బ్రహ్మాజీ ఆ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ టీడీపీలో పెను కలకలమే రేపుతోందని చెప్పాలి.