Begin typing your search above and press return to search.
కోట్లు తీసుకునే హీరోయిన్స్ కు బాధ్యత లేదా?
By: Tupaki Desk | 31 March 2020 7:10 AM GMTలాక్ డౌన్ కారణంగా అన్ని ఇండస్ట్రీలతో పాటు సినిమా ఇండస్ట్రీపై కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ కార్మికులు రోజు వారి కూలీకి పని చేసే వారు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ అంటూ ఏర్పాటు చేసి ఈ సమయంలో ఇబ్బందులకు గురి అవుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్దం అయ్యారు.
సీసీసీ కోసం పెద్ద ఎత్తున విరాళాలను సేకరిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఈ ఛారిటీ కోసం 75 వేల రూపాయల విరాళంను తనవంతుగా ప్రకటించాడు. ఇదే సమయంలో ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో సినీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. కనీస అవసరాలకు కూడా డబ్బులు లేని వారికి సాయం చేయాలనే ఉద్దేశ్యం తో సీసీసీని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం.
ఈ సమయంలో కేవలం హీరోలు మాత్రమే విరాళాలు ఇస్తున్నారు. భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకునే హీరోయిన్స్ మాత్రం ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించ లేదు. హీరోయిన్స్ సినీ కార్మికుల విషయంలో బాధ్యత లేదా అంటూ బ్రహ్మాజీ ప్రశ్నించాడు. లావణ్య త్రిపాఠి మాత్రమే ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోయిన్స్ లో విరాళంను అందించారు.
ఇంకా పలువురు హీరోయిన్స్ ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది భారీ పారితోషికాలను అందుకుంటూ ఉంటారు. ఈ సమయంలో వారు కూడా సీసీసీ కి విరాళం ఇవ్వాలంటూ బ్రహ్మాజీ విజ్ఞప్తి చేశాడు.