Begin typing your search above and press return to search.
దేవుడి గురించి చెప్తానంటున్న హాస్యబ్రహ్మ
By: Tupaki Desk | 19 Dec 2021 5:12 AM GMTతెలుగు సినిమా ప్రేక్షకులకు కామెడీ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో ప్రథమంగా ఉండే పేరు బ్రహ్మానందం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్రహ్మానందం కామెడీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా అభిమానులను మరియు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది. బ్రహ్మానందం గత కొంత కాలంగా సినిమాల్లో యాక్టివ్ గా లేరు. ఆయనలోని కమెడియన్ ను ఈ తరం దర్శకులు ఆవిష్కరించడంలో విపలం అవుతున్నారు. అయినా కూడా ఆయన పాత కామెడీ వీడియోలు.. మీమ్స్ రూపంలో ఇప్పటికి నవ్విస్తూనే ఉన్నారు. బ్రహ్మానందం ప్రస్తుతం పూర్తి విశ్రాంతి మూడ్ లో ఏమీ లేరు. అప్పుడప్పుడు సినిమాల్లో నటించడంతో పాటు టీవీ షో లు.. టాక్ షోల్లో కనిపిస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున బ్రహ్మానందం అభిమానులు మళ్లీ ఆయన సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు. కాని ఆయన మళ్లీ మునుపటిలా సినిమాలు చేయకపోవచ్చు అంటున్నారు.
ఇక బ్రహ్మానందం ప్రస్తుతం తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి బుక్ రాస్తున్నారట. సాదారణంగా ఇలాంటి పుస్తకాలను ఆటో బయోగ్రఫీ అంటారు. కాని ఇది ఆటో బయోగ్రఫీ కాదట. దేవుడిపై జనాల్లో నమ్మకం కలిగించేందుకు తాను చేస్తున్న చిన్న ప్రయత్నంగా బ్రహ్మానందం చెబుతున్నారు. తాను కెరీర్ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు.. ఆ పరిస్థితుల నుండి తాను బయట పడ్డ విధానంను అందుకు దేవుడు ఎలా సహాయ పడ్డాడు అనే విషయాలను చూపించబోతున్నట్లుగా బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో వారి వెంట ఉండి నడిపించే వాడే దేవుడు. ఆ విషయాలనే బుక్ రూపంలో ఇవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.
మై ఎక్స్ పీరియన్స్ విత్ గాడ్ అనే పేరుతో పుస్తకంను రాస్తున్నట్లుగా బ్రహ్మానందం పేర్కొన్నారు. ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన నేను ఢిల్లీ లోని రాష్ట్రపతి ముందు నిల్చున్నాను అంటే నేను చాలా కష్టపడ్డాను అని.. నేను సెల్ఫ్ మేడ్ అని అనుకుంటారు. కాని నా ఈ జీవితంలో.. జర్నీలో ఖచ్చితంగా దేవుడు కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. ఆయన నా జీవితంలో ఉండి నడిపించడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనేది ఈ పుస్తకంలో వివరించబోతున్నాను. నేను రాస్తున్న ఈ పుస్తకంతో ఒక్కరు అయినా దేవుడిపై నమ్మకం పెంచుకుంటే సంతోషం అన్నట్లుగా బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని నమ్మి జీవితంలో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యలు.. ఉన్నత శిఖరాలు చేరుకుంటారని బ్రహ్మానందం అన్నారు.