Begin typing your search above and press return to search.
బ్రహ్మానందం ఇంట్లో సంబరాలు
By: Tupaki Desk | 13 April 2017 2:45 PM GMTఈ మధ్య తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం పేరు అంతగా వినిపించడం లేదు. మూడు దశాబ్దాలకు పైగా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన ఆయన ఈ మధ్య బాగా జోరు తగ్గించేశారు. ఇలాంటి సమయంలో బ్రహ్మి ఇంట్లో సంతోషం వెల్లివిరిసే పరిణామం చోటు చేసుకుది. బ్రహ్మి తాత హోదా సంపాదించాడు. ఆయన పెద్ద కొడుకు గౌతమ్ తండ్రి అయ్యాడు. గౌతమ్ సతీమణి జ్యోత్స్న మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బ్రహ్మి ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. కుటుంబమంతా చాలా సంతోషంగా ఉందిప్పుడు.
బ్రహ్మానందం ఒకప్పుడు తెలుగు సినిమాల కామెడీలో ఎలాంటి ఆధిపత్యం చలాయించాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్లుగా ఆయన హవా సాగట్లేదు. మరోవైపు హీరోగా గౌతమ్ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తొలి సినిమా పల్లకిలో పెళ్లికూతురు ఫ్లాప్. ఆ తర్వాత వారెవా.. బసంతి కూడా నిరాశ పరిచాయి. ఈ మధ్యే అతను హీరోగా మను అనే సినిమా ఒకటి మొదలైంది. షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్న ఫణీంద్ర నరిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. మరి పిల్లాడి రాకతో తండ్రి.. తాతల కెరీర్లు ఊపందుకుంటాయేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/