Begin typing your search above and press return to search.
లగ్జరీ కారు కొన్న లెజెండరీ కమెడియన్
By: Tupaki Desk | 1 March 2016 1:25 PM GMTరోజుకు ఐదు లక్షల దాకా పారితోషకం పుచ్చుకునే కమెడియన్ బ్రహ్మానందం. ఇప్పుడు కొంచెం డిమాండ్ తగ్గి ఉండొచ్చు.. పారితోషకంలోనూ కోత పడి ఉండొచ్చు. కానీ కమెడియన్లలో బ్రహ్మానందం సంపాదించినంత ఇండియాలో ఇంకెవ్వరూ సంపాదించి ఉండరు అనడంలో సందేహం లేదు. ఐతే ఇప్పటికీ తన డిమాండ్ ఏమీ తగ్గలేదని.. తన రేంజి ఏమీ తగ్గలేదని చాటుకోవడానికో ఏంటో కానీ.. బ్రహ్మానందం లేటెస్టుగా ఓ లగ్జరీ కారు కొన్నట్లు సమాచారం. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందని ఓ హై ఎండ్ మోడల్ కారును ఆయన ఇటీవలే కొనుగోలు చేశారట. టాలీవుడ్ లో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఈ కారు ఉన్నట్లు సమాచారం. కారు రేటు ఎంత అన్నది క్లారిటీ లేదు కానీ.. కొన్ని కోట్లల్లోనే ఉంటుందంటున్నారు.
గత ఏడాది బ్రహ్మానందం నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడం, ఆయన పాత్రలు కూడా పేలకపోవడంతో టాలీవుడ్ లో బ్రహ్మానందం పనైపోయిందన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఐతే బ్రహ్మానందం నవ్వించలేకపోతే అది రచయితలు, దర్శకుల తప్పవుతుంది కానీ.. ఆయన ప్రమేయం ఏముంటుంది? అయినప్పటికీ ఈ ఏడాది బ్రహ్మానందం చేతిలో క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ - బ్రహ్మోత్సవం - బాబు బంగారం - సుప్రీమ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగానే ఉన్నాడు బ్రహ్మి. సంక్రాంతికి వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ బ్రహ్మానందానికి శుభారంభాన్నిచ్చింది కూడా. మరి ఇకపై ఆయన కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.