Begin typing your search above and press return to search.
బ్రహ్మి ఏం చేస్తున్నట్లు?
By: Tupaki Desk | 30 July 2018 2:30 PM GMTహీరోలు వస్తుంటారు పోతుంటారు.. కానీ నేను మాత్రం ఇక్కడే స్థిరంగా ఉంటాను అన్నట్లుగా మూడు దశాబ్దాలకు పైగా టాలీవుడ్లో హవా సాగిస్తూ టాప్ కమెడియన్ గా వెలుగొందాడు బ్రహ్మానందం. ఒక దశలో హీరోల్ని మించిన ఇమేజ్ తెచ్చుకుని.. కేవలం తన కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేసిన ఘనత కూడా ఆయనదే. 2000వ సంవత్సరానికి అటు ఇటు కొంచెం ఆయన జోరు తగ్గినట్లు అనిపించింది కానీ.. మళ్లీ శ్రీను వైట్ల.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుల అండతో చెలరేగిపోయాడు బ్రహ్మి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉండేది. ఇక బ్రహ్మి తనకు తానుగా రిటైరవ్వాలే కానీ.. ఆయన జోరు ఎప్పటికీ తగ్గదనే అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి నటుడికైనా ఏదో ఒక దశలో ఎదురు గాలి తప్పదని.. జోరు తగ్గాల్సిందే అని రుజువు చేస్తూ బ్రహ్మి సైతం కింద పడ్డాడు. మూణ్నాలుగేళ్ల కిందట బ్రహ్మికి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఆయన క్యారెక్టర్లు తేలిపోయాయి.
అయినా మంచి క్యారెక్టర్లు పడకుండా పోతాయో.. బ్రహ్మి పుంజుకోకపోతాడా అనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. మరింతగా డౌన్ అవుతూ వెళ్లిన బ్రహ్మి.. ఇప్పుడు దాదాపుగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యాడు. ఈ ఏడాది బ్రహ్మి ఒకటీ అరా సినిమాల్లో కనిపించాడు కానీ.. అవి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. స్టార్ డైరెక్టర్లు.. హీరోల సినిమాలకు ఆయన పూర్తిగా దూరం అయిపోయారు. ఆయన మళ్లీ పుంజుకునే అవకాశాలేమీ కనిపించడం లేదు. బ్రహ్మి కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి.. ఇక విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమైపోయినట్లు సమాచారం. ఈ సమయంలో ఆయన తన కొడుకు గౌతమ్ కెరీర్ ను దిద్దే ప్రయత్నంలో పడ్డట్లు సమాచారం. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన గౌతమ్.. ఒక్క హిట్టూ కొట్టలేకపోయాడు. ఇప్పుడతను ‘మను’ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం ఫైనాన్స్ సమస్యలతో మరుగున పడిపోయింది. ఐతే ఈ మధ్య బ్రహ్మి జోక్యంతో కొంచెం కదలిక వచ్చినట్లు సమాచారం. ఒక యుఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో మాట్లాడి బ్రహ్మినే దీన్ని బయటికి తీశాడట. మరోవైపు గౌతమ్ కు వేరే ఒక సినిమా ఇప్పించడానికి కూడా బ్రహ్మి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.