Begin typing your search above and press return to search.

చిరంజీవి 'మహానుభావుడు' : బ్రహ్మానందం

By:  Tupaki Desk   |   25 April 2020 2:00 PM GMT
చిరంజీవి మహానుభావుడు : బ్రహ్మానందం
X
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సామాన్యుడి నుండి సెలెబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి నుండే మీడియా ఛానళ్లకు ఇంటర్వూస్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా హాస్యనటుడు బ్రహ్మానందం ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో కరోనా క్రైసిస్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని బ్రహ్మానందం ప్రశంసించారు. 'లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమపై ఆధారపడిన జీవిస్తున్న రోజువారీ కూలీల జీవనోపాధి గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు.. కాని ఈ సంక్షోభాన్ని ఎవరు పరిష్కరించబోతున్నారు అని అనుకుంటున్న సమయంలో మహనుభావుడు చిరంజీవి ముందుకొచ్చాడు' అన్నారు.

అంతేకాకుండా 'నేను 35 సంవత్సరాల నుండి చిత్ర పరిశ్రమలో ఉన్నాను.. చిరంజీవి గారు 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు.. సినీ ఇండస్ట్రీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయనకు తెలుసు. సడన్ గా మీకు ఇంక పని ఉండదు.. రాబోయే రెండు మూడు నెలలు పని లభించదని చెప్తే వారి పరిస్థితి ఎలా ఉంటుంది.. కానీ చిరంజీవి గారి చొరవతో వారికి కొంత ఉపశమనం లభిస్తుంది' అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో వేలాది మంది సినీ కార్మికులు జీవనోపాది కోల్పోయారు. ఉపాధి కోల్పోయిన తెలుగు సినిమా కార్మికులకు అండగా తామున్నామంటూ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీ.సీ.సీ) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఏర్పాటు చేసిన 'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి భారీగా విరాళాలు అందజేశారు. ఈ ఛారిటీ ద్వారా సుమారు రెండువేల రెండొందలు విలువ చేసే బియ్యం మరియు 18 రకాల నిత్యావసర సరుకులను ప్రతి కుటుంబానికి నెలవారీగా అందించనున్నారు.