Begin typing your search above and press return to search.
బ్రహ్మీ బౌన్స్ బ్యాక్ అవుతాడా?
By: Tupaki Desk | 31 May 2017 4:23 AM GMTటాలీవుడ్ లో బ్రహ్మానందం అంటే ఓ బ్రాండ్. కామెడీకి కేరాఫ్ అడ్రస్. సినిమాలను సింగిల్ హ్యాండ్ తో సక్సెస్ తీరాలకు చేర్చగలుగుతాడని దర్శక నిర్మాతల నమ్మకం. కొందరు స్టార్ హీరోల సినిమాలు కూడా బ్రహ్మానందం పాత్రను కీలకంగా చేసుకుని.. హిట్ మెట్టు దాటేసిన దాఖలాలున్నాయి. అయితే ఇవన్నీ ఒకనాటి గురించిన మాటలే.
ప్రస్తుతం బ్రహ్మానందంకు బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఒకవైపు బ్రహ్మీ కేరక్టర్లు క్లిక్ కాకపోవడం.. అదే సమయంలో ఇతర కొత్త పాత కమెడియన్స్.. స్టార్ స్టేటస్ వైపు దూసుకొచ్చేయడం జరుగుతున్నాయి. ఒకప్పుడు బ్రహ్మానందంలేని సినిమా ఉండేది కాదు. అందుకే 1000 సినిమాలు చేసి గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కేశాడాయన. ఇప్పుడు ఆచారి అమెరికా యాత్ర అంటూ మంచు విష్ణుతో కలిసి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు.. బ్రహ్మానందం ఇద్దరూ బ్రాహ్మణుల రోల్స్ కనిపించనుండగా.. ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ చేయనున్నారు.
కొన్నేళ్ల క్రితం దేనికైనా రెడీ చిత్రంలో బ్రహ్మీ చివరగా బ్రాహ్మిన్ పాత్ర పోషించాడు. ఈ కేరక్టర్.. ముఖ్యంగా ఓ డైలాగ్ బాగా వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత మళ్లీ బ్రాహ్మిన్ రోల్ లో చేయలేదు బ్రహ్మీ. ఆ సినిమాలో కూడా విష్ణునే హీరో కావడం విశేషం. మళ్లీ ఇప్పుడు మంచు విష్ణుతోనే కలిసి.. బ్రాహ్మణుడి పాత్రలోనే హాస్యం పంచనున్నాడు హాస్య బ్రహ్మ. మరి ఈ సినిమాతో బ్రహ్మానందం బౌన్స్ బ్యాక్ అయి.. తన పూర్వ వైభవం దక్కించుకుంటాడేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/