Begin typing your search above and press return to search.
బ్రహ్మీ ముక్కలాట బాగుందిమామ..
By: Tupaki Desk | 28 July 2015 7:43 PM GMT1000 సినిమాల్లో నటించిన ఏకైక కమెడియన్ బ్రహ్మీ అలియాస్ బ్రహ్మానందం. బ్రహ్మీ లేనిదే తెలుగు సినిమా లేదు. బ్రహ్మీ పాదం మోపనిదే స్టార్ హీరోలకి, స్టార్ డైరెక్టర్లకి అస్సలు ఆన్ సెట్స్ ఏం చేయాలో పాలుపోదు. కథారచయితలకు సైతం బ్రహ్మీ కోసం క్యారెక్టర్ రాయనిదే అస్సలు ఫుడ్డే దొరకదు. అంతటి ప్రాధాన్యత బ్రహ్మానందంకి ఉంది. అందుకే ఇప్పటికీ అతడికి టాలీవుడ్ లో తిరుగేలేదు. క్షణం తీరిక లేని బిజీ షెడ్యూళ్లతో అలుపెరగని యోధుడిలా నిత్యం శ్రమిస్తూనే ఉన్నాడాయన.
అంతేనా ఇటీవలి కాలంలో అటు కోలీవుడ్ నుంచి కూడా అతడిపై ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారంతా. ఏదైనా ఓ కోలీవుడ్ సినిమా తెలుగులోకి అనువాదమై హిట్ కొట్టాలంటే అందులో బ్రహ్మీ ఉండాల్సిందేనని అక్కడి డైరెక్టర్లు భావిస్తున్నారు. అందుకే స్టార్ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా ఎవరి కోసమైనా బ్రహ్మీని ఎలా లాక్ చేయాలా? అని ఆలోచిస్తున్నారు. అప్పట్లో సూర్య, విక్రమ్ లాంటి హీరోల సినిమాల్లోనూ బ్రహ్మీ కనిపించాడు. మునుముందు బ్రహ్మానందం కనిపించే సినిమాలెన్నో రాబోతున్నాయి. ఇప్పుడు తంబీలకు ఇదో తారకమంత్రం అయిపోయింది. కారణం ఏదైనా బ్రహ్మీకి ఇప్పుడు కోలీవుడ్ లో మార్కెట్ పెరిగింది. ఇప్పటికే 1000 సినిమాలు పూర్తయ్యాయి. ఇక 2000 టార్గెట్ ని పూర్తి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.