Begin typing your search above and press return to search.
వేర్ ఈజ్ బ్రహ్మానందం
By: Tupaki Desk | 5 Aug 2015 4:10 PM GMTబ్రహ్మానందం పనైపోయిందన్న ప్రచారం ఏడాదిన్నర కిందటే మొదలైంది. ఐతే ఇండస్ట్రీ జనాలు తమ పాటికి తాము ఈ గుసగుసలతో కాలక్షేపం చేస్తుండగానే బ్రహ్మి మాత్రం నిక్షేపంగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. గత ఏడాది కూడా చాలా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు బ్రహ్మి. కానీ ఇప్పుడాయన పరిస్థితి ఏమంత బాగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. తనకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టిన శ్రీనువైట్ల కూడా ‘ఆగడు’లో బ్రహ్మితో కామెడీ పండించలేకపోయాడు. బ్రహ్మిని భలేగా వాడుకునే త్రివిక్రమ్ సైతం ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో మ్యాజిక్ చేయలేకపోయాడు. దీంతో బ్రహ్మి డిమాండ్ ఈ మధ్య బాగా తగ్గినట్లే కనిపిస్తోంది.
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మి ఉన్నట్లుగా కనిపించడం లేదు. శ్రీను వైట్ల సైతం రామ్ చరణ్ సినిమాలో బ్రహ్మికి రోల్ ఇవ్వలేదు. ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ బ్రహ్మి లేడు. మామూలుగా అయితే బ్రహ్మి ఏదైనా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే.. ఆయన పాత్ర గురించి షూటింగ్ దశలోనే లీకులిస్తారు. ముందే దానికి హైప్ తీసుకొస్తారు. ఆ రకంగా ఈ మధ్య బ్రహ్మి క్యారెక్టర్ దేని గురించి కూడా ప్రచారం జరగట్లేదు. బ్రహ్మి ఏ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి కూడా తెలియట్లేదు. దీన్ని బట్టే బ్రహ్మి టైం ఏమంత బాగా లేదని అర్థమవుతోంది. ఇప్పుడాయన ఆశలన్నీ కిక్-2 మీదే ఉన్నాయి. బ్రహ్మి స్లో అయ్యాడు కాబట్టి ఇంకెవరైనా ఆయన అవకాశాల్ని పట్టేస్తున్నారా.. హైలైట్ అవుతున్నారా అంటే అదీ లేదు. సప్తగిరి అప్పుడే మొహం మొత్తేస్తున్నాడు. పృథ్వీ ఇంకా స్థాయి పెంచుకోలేదు. జబర్దస్త్ కమెడియన్లకు కూడా సరైన క్యారెక్టర్లు పడలేదు. మొత్తానికి బ్రహ్మి స్లో అయిపోవడంతో తెలుగు సినిమా కామెడీ లేక వెలవెలబోతున్నట్లుంది.