Begin typing your search above and press return to search.
బ్రహ్మీ జబర్ధస్త్ నటుడినే అనుకరిస్తున్నారా?
By: Tupaki Desk | 25 April 2021 6:00 AM GMTబ్రహ్మానందం అంటే ఒక బ్రాండ్. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు ఆయన ప్రపంచ సినీచరిత్రలోనే అరుదైన కమెడియన్ గా పాపులరయ్యారు. కెరీర్ లో ఆయన పలికించని ఉద్వేగం లేదు. హాస్యరసం సహా నవరసాల్ని ఒలికించగలిగిన గొప్ప నటుడిగా ఆయన ప్రసిద్ధుడు. ఏదైనా ఒక పాత్రను తనకు అప్పజెబితే ఆన్ లొకేషన్ దానిని అభివృద్ధి చేసి గొప్ప టింజ్ తెచ్చిన ఎన్నో సందర్భాల్ని దిగ్గజ దర్శకులు గుర్తు చేస్తారు. ఇక దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావుతో బ్రహ్మీ అనుబంధం ఈనాటిది కాదు. ఈ జోడీ కలిసి ఎన్నో సినిమాలకు పని చేశారు.
ఇప్పుడు శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ నటవారసుడు రోషన్ నటిస్తున్న తాజా చిత్రం `పెళ్లి సందD`కి కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఇందులోనూ బ్రహ్మానందం నటిస్తున్నారు. బిల్డప్ బాబాయ్ అనే ఓ వెరైటీ పాత్రతో బోలెడంత హాస్యం పండించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. ఇది జబర్ దస్త్ లో గెటప్ శ్రీను వేసిన బిల్డప్ బాబాయ్ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించినది అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. `నమ్మరేంట్రా బాబూ` అంటూ విభిన్నమైన ఆహార్యం మేనరిజంతో గెటప్ శ్రీను ఆకట్టుకున్నారు. ఇప్పుడు బ్రహ్మీని అదే పాత్రలో చూసే వీలుందన్నది ఆశ్చర్యపరుస్తోంది.
బ్రహ్మీ ఇటీవల సినిమాలు తగ్గించారు. పాత్ర నచ్చితే అందులో వైవిధ్యం ఉంటేనే చేస్తున్నారు. జాతిరత్నాలులో జడ్జి పాత్రతో మెరుపులు మెరిపించారు. రేసుగుర్రం లో కిల్ బిల్ పాండేగా అదరగొట్టినట్టు మళ్లీ సురేందర్ రెడ్డి- అఖిల్ సినిమాలో ఒక పాత్రను చేసేందుకు ఆస్కారం ఉందని సమాచారం.
అయితే బ్రహ్మీనే పెద్ద క్రియేటర్. ఆయన ఒకరిని అనుకరించడం అనేది అరుదు. కానీ జబర్ధస్త్ నటుడినే అనుకరిస్తున్నారా? అన్న ఆశ్చర్యం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ రాఘవేంద్రరావు ఇనిషియేషన్ తోనే ఆయన అందుకు అంగీకరించారని భావించవచ్చు. అలాగే గెటప్ శ్రీను కంటే భిన్నమైన టింజ్ తో బ్రహ్మీ తనదైన మార్క్ చూపిస్తారనడంలో సందేహమేం లేదు.