Begin typing your search above and press return to search.
ఎమ్మెస్ గుర్తొస్తే చలించిపోతా
By: Tupaki Desk | 30 Jan 2016 7:56 AM GMTమన దేశంలో ఏ సినీ ఇండస్ట్రీలోనూ కనిపించని ఒక కల్చర్ టాలీవుడ్ లో కనిపిస్తుంది. అదే కుప్పలు తెప్పలుగా కమెడియన్స్ ఒకే సినిమాలో సందడి చేసేస్తుంటారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రల్లోనూ దర్శనమిస్తారు. మిగిలిన ఏ భాషలో అయినా ఒకరు లేక ఇద్దరు కమెడియన్స్ తోనే పని కానిచ్చేస్తారు. కానీ మనోళ్ల సఖ్యత అంతా ఆన్ స్క్రీన్ పై మాత్రమేనని అంటారు చాలా మంది. ఆఫ్ స్క్రీన్ లో మన కమెడియన్స్ మధ్య సఖ్యతే లేదనే రూమర్ ఉంది.
ఒకరంటే ఒకరికి పడదని కూడా అంటూ ఉంటారు. ఇదే ప్రశ్న రీసెంట్ గా హస్యబ్రహ్మ బ్రహ్మానందంకి ఎదురైంది. మాదంతా ఒకటే కుటుంబం అంటారు.. నిజంగా మీ మధ్య అలాంటి వాతావరణం ఉందా అని బ్రహ్మీని అడిగారు. దీనికి ఆయనిచ్చిన సమాధానం అందరినీ కదలించింది. 'ఎందుకు లేదండీ. ఎమ్మెస్ కీ నాకూ ఉన్న అనుబంధమే దీనికి ఉదాహరణ. ఇంకా సేపట్లో చనిపోతాడనగా ‘బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది’ అంటూ ఓ కాగితంపై రాసి వాళ్లమ్మాయికి చూపించాడట. అదెప్పుడు గుర్తొచ్చినా చలించిపోతా. ఎవరిలో ప్రతిభ ఉన్నా... వాళ్లని ప్రోత్సహించడం నాకు అలవాటు. ఎమ్మెస్ ని ఈవీవీ దగ్గరకు తీసుకెళ్లింది నేనే. అలీని హీరోని చేసింది నేనే. కావాలంటే అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలని అడగండి' అని చెప్పాడు బ్రహ్మీ.
ఈ ఒక్క మాటతో తమ మధ్య ఎంతటి అనుబంధం ఉందో చెప్పేశాడు బ్రహ్మానందం. తామంతా ఒకరంటే ఒకరికి పడదనే వార్తలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేల్చేశాడు ఈ గిన్నిస్ రికార్డ్ కమెడియన్.