Begin typing your search above and press return to search.
స్టేజ్ మీద బ్రహ్మి చితగ్గొట్టేశాడు
By: Tupaki Desk | 19 Sep 2016 7:27 AM GMTఈ మధ్య తెలుగులో బ్రహ్మానందం పేరు పెద్దగా వినిపించట్లేదు. ఆయనకు సినిమాలు తగ్గిపోయాయి. బయట వేడుకల్లో కూడా కనిపించట్లేదు. ఐతే తాజాగా కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’ ఆడియో వేడుకకు ఆయన విచ్చేశారు. స్టేజ్ ఎక్కి తనదైన శైలిలో ప్రసంగిస్తూ.. విచిత్ర విన్యాసాలు చేస్తూ ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ వేడుకకు ఆయనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రసంగానికి ముందు మైక్ అందుకోబోతూ యాంకర్ సుమను సీరియస్ గా ఓ చూపు చూసి ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే అన్నట్లు సైగ చేశాడు. తనకు మరోవైపు ఉన్న వాళ్లు కూడా వెళ్లిపోతుంటే.. మీరు కాదండీ అని ఆపి.. ‘‘ఆమె మామూలు టార్చర్ పెట్టదండీ’’ అని సీరియస్ గా ఓ మాట అనడంతో ఆడిటోరియమంతా గొల్లుమంది.
ఆ తర్వాత ‘జాగ్వార్’ సినిమాకు పనిచేసిన వాళ్లందరి గురించి ప్రస్తావించి.. ‘‘ఇదంతా వీడికెలా తెలుసు అనుకుంటున్నారేమో.. ఈ సినిమాలో నేను కూడా నటించా’’ అన్నాడు బ్రహ్మి. దేవెగౌడ సహా అందరినీ పొగిడేసి.. ‘‘ఏంటయ్యా నీ సోది.. అందరినీ ఇలా పొగిడేస్తున్నావ్ అనుకుంటున్నారేమో.. నా మాటలు పొగడ్తలు కావు. నిజాలు’’ అని బ్రహ్మి చెప్పాడు. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సింధు గురించి ప్రస్తావిస్తూ.. ఆమెతో ఫొటో దిగాలంటే తాను స్టూల్ వేసుకుని నిలబడాలని.. తాను తలఎత్తి పైకి చూస్తూ ఆమెతో మాట్లాడాల్సి వచ్చిందని బ్రహ్మి అనడంతో మరోసారి ఆడిటోరియం హోరెత్తింది. మధ్యలో ఓసారి స్క్రీన్ వైపు చూస్తూ.. జాగ్వార్ ట్రైలర్ అనగా సుమ ఏదో కరక్షన్ చెప్పింది. వెంటనే తప్పయిపోయింది క్షమించమ్మా అంటూ ఆమె దగ్గరికి వెళ్లి మొక్కబోయాడు బ్రహ్మి. ఇలా స్టేజ్ మీద ఉన్నంతసేపూ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేసి నిష్క్రమించాడు ఈ లెజెండరీ కమెడియన్.