Begin typing your search above and press return to search.

ఇది క‌దా బ్ర‌హ్మీ అస‌లైన‌ స్వాగ్ అంటే!

By:  Tupaki Desk   |   20 Sep 2022 2:30 PM GMT
ఇది క‌దా బ్ర‌హ్మీ అస‌లైన‌ స్వాగ్ అంటే!
X
తెలుగు సినిమాల్లో కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం చేసే హంగ‌మా, కామెడీ హాస్య ప్రియుల్ని పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తుంద‌న్న‌ది తెలిసిందే. అందుకే ఒక ద‌శ‌లో ఆయ‌న లేని సినిమా అంటూ లేదు. అంత‌గా ఆయ‌న ప్ర‌భావితం చేశారు. తెలుగులో ఎంతో మంది హాస్య న‌టులున్నా బ్ర‌హ్మీగా పేరు తెచ్చుకున్న బ్ర‌హ్మానందం కామెడీ టైమింగ్‌, ఆయ‌న స్టైలే సెప‌రేటు. దీంతో ఆయ‌న వెండితెర‌పై క‌నిపిస్తే చాలు క‌డుపుబ్బా న‌వ్వుకునే వాళ్లున్నారు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌ భాష‌ల్లోనూ బ్ర‌హ్మానందం ఫేవ‌రేట్ కామెడియ‌న్ అయ్యారు.

`చంట‌బ్బాయి`తో మొద‌లైన బ్ర‌హ్మానందం కామెడీ ప్ర‌స్థానం మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన `ఖైదీ నంబ‌ర్ 150` వ‌ర‌కు సాఫీగా సాగింది. ఇందులో డాబ‌ర్ మెన్ గా న‌టించి న‌వ్వులు పూయించారు. అయితే ఆ త‌రువాత ఆ స్థాయిలో న‌వ్వులు పూయించడం లేదు. చాలా వ‌ర‌కు సినిమాలు కూడా త‌గ్గించుకున్నారు. చిన్న చిన్న పాత్ర‌ల్లో మాత్ర‌మే క‌నిపిస్తూ నేనూ ఉన్నానంటున్నారే కానీ త‌న మార్కు కామెడీని మాత్రం అందించ‌డం లేదు.

`అల వైకుంఠ‌పుర‌ములో` మూవీలోని `రాములో రాములో.. పాట‌లో త‌ళుక్కున మెరిసిన బ్ర‌హ్మానందం `జాతిర‌త్నాలు`, `భీమ్లానాయ‌క్‌` సినిమాల్లో జ‌డ్జిగా క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. త్వ‌ర‌లో త‌న ఏకి త‌గ్గ పాత్ర‌లో హుందాగా క‌నిపిస్తూ `రంగ మార్తాండ‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా వుంటే మ‌ళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టారు బ్ర‌హ్మానందం. మంగ‌ళ‌వారం సెట్ లోకి ఐట్ షార్ట్‌, హాఫ్ ష‌ర్ట్, బ్లాక్ గాగుల్స్ ధ‌రించి ఫుల్ స్వాగ్ లో ఎంట్రీ ఇస్తున్న బ్ర‌హ్మానందం వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

న‌టుడు బ్ర‌హ్మాజీ ఈ వీడియోని వర్ణిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. గ‌త కొంత కాలంగా త‌న‌దైన మార్కు కామెడీకి దూరంగా వుంటున్న బ్ర‌హ్మీని నెటిజ‌న్ లు నెట్టింట మీమ్స్ తో వైర‌ల్ చేస్తున్నారు. తాజాగా బ్ర‌హ్మానందం స్వాగ్ తో సెట్ లోకి య‌మ స్టైల్ గా ఎంట్రీ ఇస్తున్న వీడియోని చూసిన వారంతా ఇదిక‌దా బ్ర‌హ్మీ అస‌లైన‌ స్వాగ్ అంటే అని నెట్టింట ఈ వీడియోపై కామెంట్ లు చేస్తూ తెగ వైర‌ల్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.