Begin typing your search above and press return to search.

నాన్నకు నంది దక్కడం హ్యాపీగా ఉంది

By:  Tupaki Desk   |   18 Nov 2017 12:41 PM GMT
నాన్నకు నంది దక్కడం హ్యాపీగా ఉంది
X
నందమూరి వారసుల కోసం నందులు పరిగెత్తడం ఈ సారి పెను దుమారమే రేపింది, అయితే పరిస్థితి ఎలా ఉన్నా కొందరు మాత్రం చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఇకపోతే రీసెంట్ బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి కూడా తన తండ్రికి ఉత్తమ నటుడి పురస్కారం దక్కడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అయితే వివాదాలు ఇంతలా చెలరేగుతున్నాయి కదా దానిపై స్పందన ఏమిటంటే ఆమె దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరైనది కాదని బదులిచ్చారు.

అయితే శనివారం ఆమె ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసనతో కలిసి ఫేస్‌ బుక్‌ - ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని స్టార్ట్ చేశారు. అంతే కాకూండా రక్తదానంపై ప్రచారం కల్పించేందుకు ఫేస్‌ బుక్‌ బ్లడ్‌ టూల్‌ ను ప్రారంభించినట్టు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ లో బ్రాహ్మణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఏడాది దేశంలో 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతోంది కానీ కేవలం రెండున్నర కోట్ల యూనిట్లు మాత్రమే అందుబాటులోకి వస్తోంది.

అందుకే రక్తదానం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ముఖ్యంగా యువత ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులకు తెలియజేయాలని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో కొందరు రాక్తదానం చేశారు. వారితో పాటు బ్రాహ్మణి కూడా రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా ఈ కార్యక్రమాన్ని నిర్వయించినట్లు చెప్పారు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి హేరిటేజ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా ఉన్న సంగతి తెలిసిందే.