Begin typing your search above and press return to search.

బాలయ్య గోడ దూకేవాడట..

By:  Tupaki Desk   |   10 Jun 2020 11:50 AM GMT
బాలయ్య గోడ దూకేవాడట..
X
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలయ్య సకల కళల్లో మేటి అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అటు నటనలో.. ఇటు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక క్యాన్సర్ రోగుల కోసం ఆస్పత్రి కట్టించి సేవా చేస్తున్నారు. అంతేకాదు.. తాజాగా బాలయ్య బర్త్ డే సందర్భంగా ఒక పాట పడి జనాల మీదకు వదిలారు.. బాలయ్య పుట్టినరోజున అంతటా సందడి నెలకొంది.

తాజాగా తన తండ్రి 60 పుట్టినరోజు సందర్బంగా ఆయన కూతురు బ్రాహ్మణి మీడియాతో మాట్లాడింది. తండ్రితో తనకున్న మంచి అనుభూతులు పంచుకుంది. తన తండ్రితో తనకు మధురానుభూతులు ఉన్నాయని.. చిన్నప్పుడు తమ ఇంటి ముందున్న పార్క్ లో నాన్నతో కలిసి వ్యాయామానికి వెళ్లేదానినని తెలిపింది.

చిన్నప్పుడు తన తండ్రి కలిసి తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లోకి వ్యాయామాలు చేయడానికి వెళ్లేవారమని బ్రాహ్మణి తెలిపింది.. అప్పటికి పార్క్ తలుపులు తీయకపోవడంతో పార్క్ గోడ ఎక్కించి తనను లోపలికి వదిలిపెట్టి.. తర్వాత బాలయ్య గోడ దూకేవారని బ్రాహ్మణి చిన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుంది. ఇద్దరం లోపల కసరత్తులు చేసుకునేసరికి పార్క్ గేట్ తీసేవారని చెప్పుకొచ్చింది. చిన్నపిల్లలతో బాలయ్య బాగా కలిసిపోతాడని బ్రాహ్మణి తన తండ్రి గురించి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది.