Begin typing your search above and press return to search.
'బ్రహ్మాస్ర్త-1' ని కంగారుపెడుతోన్న పరాజయాల పరంపర!
By: Tupaki Desk | 27 July 2022 2:30 AM GMTరెండేళ్ల నుంచి బాలీవుడ్ కి సరైన సక్సెస్ ఇంత వరకూ పడలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నీ పరాజయాల్నే మూటగట్టకుంటున్నాయి. కొన్ని యావరేజ్ గా ఆడిన బాలీవుడ్ వసూళ్లతో లెక్కగడితే అన్ని కలిపి కనీసం 800 కోట్ల వసూళ్లతని కూడా సాధించి ఉండదు. `గంగూబాయి కతియావాడి`.. `ది కశ్మీర్ ఫైల్స్`.. `భూల్ బులయ్యా-2`.. `సూర్యవంశీ` సినిమాలకు ఆదరణ బాగున్నా పైన చెప్పిన మార్క్ ని కూడా టచ్ చేయలేదు.
అయితే బాలీవుడ్ పరువును కాస్తా..కూస్తో ఈ చిత్రాలే నిలబెట్టాయి. పరిమిత బడ్జటె్ లో తెరకకెక్కిన సినిమాలు వాటి పరిధిలో మంచి వసూళ్లే సాధించాయని చెప్పాలి. ఇటీవలే 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన `షంషేరా` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడం లో విఫలమైంది. ఈ సినిమా 50 కోట్లు వసూళ్లు అయినా తెస్తుందా? అన్న సందేహం వెంటాడుతోంది.
మరి ఈ సంకేతాలన్ని `బ్రహ్మస్ర` మొదటి భాగాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయా? ట్రైలర్ టాక్ ని బట్టి అలాగే భావించాలా? అంటే అలాగే కనిపిస్తోంది. రణబీర్ కపూర్..అలియాభట్ హీరోహీరోయిన్లగా అమితాబచ్చన్..నాగారన్జున లాంటి దిగ్గజాలు నటించిన బ్రహ్మస్ర్త మొదటి భాగం సెప్టెంబర్ 9న రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఇప్పటికే ట్రైలర్ పేలవంగా ఉందని తేలిపోయింది. పాత సినిమా గ్రాఫిక్స్ లా కనిపిస్తున్నాయి తప్ప అందులో కొత్తదనం ఎక్కడ? అన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ బజ్ లేదు. తెలుగు వెర్షన్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నా ట్రైలర్ ఫలితం ఆయన క్రేజ్ పైనా ప్రభావాన్ని చూపిస్తుంది.
రాజమౌళి నిజంగా మనసుకు నచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేయడానిక ముందుకొచ్చారా? రణబీర్ కపూర్...అబితాబచ్చన్ మాట కాదనలేక ముందుకొచ్చారా? అన్న సందేహం సైతం తెరపైకి వస్తోంది. సోషల్ మీడియాలో సినిమాపై ఏ మాత్రం బజ్ క్రియేట్ అవ్వలేదు.
ఇప్పుడీ నెగిటివిటీ సహా...బాలీవుడ్ వెనుక బాటు తనం `బ్రహ్మస్ర్త` టీమ్ ని కాస్త కంగారు పెడుతున్నట్లు కనిపిస్తుంది. పైగా బ్రహ్మస్ర్త ఇంకా రెండు..మూడు భాగాలు కూడా ఉందని అంటున్నారు. రిలీజ్ అయి ఫలితం తేలకుండానే విషయాన్ని రివీల్ చేయడం అతి నమ్మకాన్ని హైలైట్ చేస్తుంది. మరి వీటన్నింటిని `బ్రహాస్ర్త` మొదటి భాగం ఎలాంటి ఫలితంతో అధిగమిస్తుందో చూడాలి.