Begin typing your search above and press return to search.

బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ టార్గెట్.. ఎంత రావాలంటే?

By:  Tupaki Desk   |   8 Sep 2022 11:30 AM GMT
బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ టార్గెట్.. ఎంత రావాలంటే?
X
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాలు ఇటీవల చాలానే డిజాస్టర్ అయ్యాయి. అయితే ఇప్పుడు మొదటిసారి ఒక పాన్ ఇండియా సినిమాతో రణ్ బీర్ కపూర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అలియా భట్ హీరోయిన్ గా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ శుక్రవారం రోజు సౌత్ లో కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుంది అనేదానిపైనే అసలు రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.

ఇక సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అనే వివరాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ సినిమాకు బడ్జెట్ అయితే చాలా ఎక్కువ అయింది. ఒక విధంగా రణబీర్ కపూర్ మార్కెట్ కంటే ఇది చాలా ఎక్కువ.

కానీ నిర్మాతలు దర్శకుడుని అలాగే సినిమా కథను నమ్మి దాదాపు 410 పది కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే కనీసం 420 కోట్లు అయినా వెనక్కి తేవలసి ఉంటుంది.

అయితే ముందుగానే నిర్మాతలకు నాన్ థియేట్రికల్ గా పెట్టిన పెట్టుబడిలో కొంత అయితే వెనక్కి వచ్చింది. సినిమా ఓటీటీ శాటిలైట్ డిజిటల్ మ్యూజిక్ రైట్స్ ద్వారా దాదాపు 150 కోట్ల వరకు వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాల ప్రకారం అయితే ఓపెనింగ్స్ 30 నుంచి 40 కోట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా గట్టిగానే ఉన్నాయి.

కానీ సౌత్ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది కొంతగానే అనుమనంగానే ఉంది. సినిమాకు భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తే గాని తెలుగులో అలాగే తమిళంలో సక్సెస్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.

బాలీవుడ్ లో అయితే జనాలు మొదటి రోజు ఎక్కువగా చూసే అవకాశం ఉంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ కూడా పెరుగుతున్నాయి. తప్పనిసరిగా అయితే సినిమాకు పాజిటివ్ టాక్ అయితే రావాలి. మరి బ్రహ్మాస్త్ర సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో క్లిక్ అవుతుందో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.