Begin typing your search above and press return to search.

బ్ర‌హ్మాస్త్ర‌కు హైప్.. ఎందుకు ఇన్ని పాట్లు..?

By:  Tupaki Desk   |   13 Sep 2022 5:37 AM GMT
బ్ర‌హ్మాస్త్ర‌కు హైప్.. ఎందుకు ఇన్ని పాట్లు..?
X
బాలీవుడ్ కి హిట్టు అన్న‌దే లేదు. క‌రోనా త‌ర్వాత ఇది అతి పెద్ద క్రైసిస్ లా మారింది. అగ్ర హీరోల సినిమాలు కూడా ఐపు లేకుండా పోతుండ‌డంతో హిందీ మీడియాకి సైతం దిగులు ప‌ట్టుకుంది. ఇండ‌స్ట్రీ ఇలానే కొనసాగితే అది అంద‌రికీ ప్ర‌మాద‌మేన‌ని గ్రహించిన‌ట్టుంది మీడియా. అందుకే మునుపెన్న‌డూ లేనంత‌గా బ్ర‌హ్మాస్త్ర‌ను నెత్తిన పెట్టుకుని ప్ర‌మోట్ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ ముందే బోలెడంత హైప్ పెంచ‌డంలో ముంబై మీడియా పెద్ద స‌క్సెసైంది.

ఓవైపు ప్రాంతీయ మీడియాలు ఇదేమి గొప్ప‌ సినిమా? అస‌లు అర్థం కాలేదు! అని తీసిపారేస్తే అందుకు భిన్న‌మైన రివ్యూలు క‌థ‌నాలు హిందీ మీడియాలో బ్ర‌హ్మాస్త్ర‌పై కుప్ప‌లుగా వ‌చ్చి ప‌డ్డాయి. ఈ మూవీకి భారీత‌నం నిండిన గ్రాఫిక్స్ త‌ప్ప ఎమోష‌న్ కానీ ల‌వ్ ఫీల్ కానీ ఎక్క‌డా క‌నెక్ట్ కాలేద‌ని తెలుగు మీడియాలు తీవ్రంగా విమ‌ర్శించాయి. కానీ అందుకు భిన్నంగా బాలీవుడ్ మీడియాల్లో మాత్రం రిలీజ్ ముందు నుంచి పాజిటివ్ బ‌జ్ క్రియేట్ అయింది.

ఇదంతా చూస్తుంటే దీనికోసం చాలా త‌తంగ‌మే న‌డిచింద‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా బ్ర‌హ్మాస్త్ర వంద కోట్ల క్ల‌బ్ లో కేవ‌లం 3రోజుల్లోనే చేరిందంటూ క‌థ‌నం ప్ర‌చురించింది. వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన సినిమాల జాబితాను ప్ర‌స్థావిస్తూ బ్ర‌హ్మాస్త్ర వేగంగా 100కోట్ల క్ల‌బ్ లో చేరిన సినిమాగా క‌థ‌నం ప్రచురించింది. అయితే ఈ జాబితాలో ఎక్క‌డా బాహుబ‌లి 2 పేరు క‌నిపించ‌లేదు.

బ్ర‌హ్మాస్త్ర ఐదు రోజుల్లో 150 కోట్ల క్లబ్ లో చేర‌బోతోంది. 200 కోట్ల క్ల‌బ్ లో చేర‌డానికి చేరువ‌వుతోంది! అంటూ వ‌రుస క‌థ‌నాలు ఊద‌ర‌గొడుతున్నాయి కొన్ని మీడియాలు. ఇక బ్ర‌హ్మాస్త్ర‌కు ఆరంభం భారీ వ‌సూళ్లు ద‌క్కిన మాట నిజ‌మే కానీ.. మ‌రీ కొన్ని మీడియాలు అతిగా రాస్తుండ‌డంతో డౌట్లు పుట్టుకొస్తున్నాయ్! బాక్సాఫీస్ లెక్క‌ల ప‌రంగా ఎలాంటి గార‌డీ లేకుండా అంత పెద్ద వ‌సూళ్లు ద‌క్కితే ఆనంద‌మే. లేదా కంగ‌న విమ‌ర్శించిన‌ట్టు అవ‌న్నీ కాకి లెక్క‌లేన‌ని తేలితే మునిగేది ఈ సినిమాను కొన్న పంపిణీదారులు.. నిర్మాత‌లే!! కానీ అలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆశిద్దాం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.