Begin typing your search above and press return to search.
అక్కడ కరణ్.. ఇక్కడ రాజమౌళి
By: Tupaki Desk | 31 May 2022 4:30 PM GMTటాలీవుడ్ సినిమాకు కరణ్ బాలీవుడ్ లో వెన్నుదన్నుగా నిలిస్తే దక్షిణాదిలో బాలీవుడ్ సినిమాకు రాజమౌళి సపోర్ట్ చేస్తున్నారు. ఇచ్చిపుచ్చుకునే థోరణిలో ఆరోగ్యకరవాతావరణాన్ని ఈ ఇద్దరూ దక్షిణాదికి. ఉత్తరాదికి వారథులుగా నిలుస్తున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన భారీ ప్రతిష్టాత్మక మూవీ `బాహుబలి`. ఈ మూవీ రెండు భాగాలకు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ అండగా నిలిచారు. రానా ప్రమేయంతో ఈ రెండు చిత్రాలకు కరణ్ జోహార్ బాలీవుడ్ లో సపోర్ట్ గా నిలిచి విడుదల చేశారు.
అదే ఇప్పడు ఇతర దక్షిణాది చిత్రాలకు రాచబాటగా మారింది. కరణ్ స్ఫూర్తితో ఆ తరువాత బాలీవుడ్ లో విడుదలవుతున్న చిత్రాలకు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరు కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలని బాలీవుడ్ లో విడుదల చేశారు. ఇక రీసెంట్ గా రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ `ట్రిపుల్ ఆర్`ని పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ ఉత్తరాదిలో విడుదల చేశారు.
ముందు టాలీవుడ్ కు చెందిన భారీ చిత్రాలకు అండగా నిలిచిన కరణ్ దక్షిణాదిలో రాజమౌళి సపోర్ట్ చేస్తున్నారు. కరన్ జోహర్, హీరూ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, మారికె డిసౌజా సంయుక్తంగా నిర్మించిన చిత్రం `బ్రహ్మాస్త్ర` పార్ట్ 1. రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో శివ తత్వాన్ని ప్రధానంగా చెప్పబోతున్నారు.
ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్, డింపుల్ కపాడియా, కీలక అతిథి పాత్రలో షారుక్ ఖాన్ నటించారు. సెప్టెంబర్ 9న ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు దక్షిణాది భాషల్లో దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందంతో కలిసి రాజమౌళి దక్షిణాదిలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. మంగళవారం వైజాగ్ లో ఫ్యాన్స్ తో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముందుగా సింహాచలం వెళ్లి అక్కడి వరహా నృసింహ స్వామిని రాజమౌళి, రణ్ బీర్ కపూర్ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ లో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కు ఘన స్వాగతం లభించింది. గజమాలలతో ప్రేక్షకులు ఆహ్వానం పలికారు. మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా రూపొందిన `బ్రహ్మాస్త్ర` మొత్తం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.