Begin typing your search above and press return to search.

బ్ర‌హ్మాస్త్ర కు UA.. సుమారు 3 గంట‌ల నిడివి

By:  Tupaki Desk   |   6 Sep 2022 4:35 AM GMT
బ్ర‌హ్మాస్త్ర కు UA.. సుమారు 3 గంట‌ల నిడివి
X
రణబీర్ కపూర్- అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రహ్మాస్త్ర' ఎట్టకేలకు మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- నాగార్జున- మౌని రాయ్ -షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొణె వంటి టాప్ స్టార్లు అతిథులుగా న‌టించారు. విడుదలకు ముందు బోలెడంత హైప్ నెల‌కొంది. బ్రహ్మాస్త్ర చుట్టూ ఉన్న విపరీతమైన హైప్ అంచనాల‌ నేప‌థ్యంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. ఈ చిత్రం మంచి ప్రారంభంతో టేకాఫ్ అవుతుందని భావిస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ లు ఈ చిత్రం ప్రారంభ రోజు కలెక్షన్లు బలమైన రెండంకెల రేంజ్ లో ఉండ‌వచ్చని సూచిస్తున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) UA సర్టిఫికేట్ తో క్లియర్ చేసిందని స‌మాచారం. సినిమా నిడివి సుదీర్ఘ స‌మ‌యం ఉందని కూడా గుస‌గుస వినిపిస్తోంది. సుమారు 166.54 నిమిషాల (2 గంటలు 46 నిమిషాలు మరియు 54 సెకన్లు) షో ఇది. బ్రహ్మాస్త్రం మూడు గంటల మార్కుకు చాలా దగ్గరగా ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే చాలా ఎక్కువ సేపు ఓపిగ్గా చూడాల్సి ఉన్నా కానీ ప్రేక్షకుల అంచనాల రేంజులో కంటెంట్ ఉంటుంద‌ని బ‌ల‌మైన టాక్ వినిపిస్తోంది.

ట్రేడ్ నివేదికల ప్రకారం.. VFX స‌హా ఈ మూవీ క‌థాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ న‌మ్ముతోంది. బ్రహ్మస్త్ర ఓపెనింగ్ డే రూ. రూ. 20-25 కోట్ల మార్క్ ను తాకుతుంద‌ని ఓ అంచ‌నా. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలు చ‌వి చూసిన బాలీవుడ్ కి బ్ర‌హ్మాస్త్ర పూర్తి ఊర‌ట‌నిస్తుందా లేదా? అన్న‌ది వేచి చూడాల్సి ఉంటుంది.

టికెట్ ధ‌ర‌తోనే చిక్కులు..

టికెట్ ధ‌ర రూ.150- 200 వ‌ర‌కూ అయితే ఫ‌ర్వాలేదు కానీ అంత‌కుమించితే మ‌ధ్య‌త‌ర‌గ‌తి థియేట‌ర్ల‌కు రావ‌డం మానుకుంటున్నార‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. కానీ హిందీ సినిమా బ్రహ్మాస్త్ర కు హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో రూ.325 రేటు పెట్టడం చ‌ర్చ‌గా మారింది. ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే రేట్ ఇది.

నెట్ బుకింగ్ ఛార్జీలు కూడా క‌లుపుకుని ఏకంగా రూ.360 చెల్లించాల్సి రావ‌డం షాకిస్తోంది. భారీ బ‌డ్జెట్ మూవీ పైగా 3డి సినిమా కాబ‌ట్టి ఇంత రేటు త‌ప్ప‌దు అనుకుంటే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాల్సిన స‌న్నివేశం ఉంది. ఇక క‌రోనా క్రైసిస్ త‌ర్వాత పెరిగిన ధ‌ర‌ల‌తో జ‌నం కునారిల్లుతుంటే వినోదానికి ప్ర‌జ‌లు బిగ్ బ‌డ్జెట్ పెట్ట‌డం ఎలా సాధ్యం? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

హిందీతో పాటు తెలుగు వెర్షన్ కు ఇంత పెద్ద రేటును పంపిణీదారులు ఫిక్స్ చేశాయి. అయితే తెలుగులో డ‌బ్బింగ్ సినిమాల‌కు మ‌రీ అంత గిరాకీ ఉండ‌దు. ర‌ణ‌బీర్ గ్రాఫిక‌ల్ మూవీకి అంత సీనుందా లేదా? అన్న‌ది రిలీజ్ డే తేలిపోతుంది. హిందీ బెల్ట్ లో ఉన్నంత బ‌జ్ తెలుగులో లేదు. మ‌ల్టీప్లెక్సుల వ‌ర‌కూ భారీ ధ‌ర‌లు చెల్లించేవారున్నా కానీ సింగిల్ స్క్రీన్ల‌కు రైజ్ ఎలా ఉంటుంది? అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. కానీ ప్రాంతీయ భాష‌ల్లో ఈ చిత్రం స‌త్తా చాటుతుందా లేదా?  కంటెంట్ ఎక్కుతుందా లేదా? అన్న‌దానికి ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.