Begin typing your search above and press return to search.
OTTలో బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 26 Oct 2022 2:30 AM GMTరణబీర్ కపూర్- ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మీడియా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ అంటూ హైప్ చేసినా కానీ వాస్తవిక లెక్కలు వేరుగా ఉన్నాయని పలువురు బాక్సాఫీస్ పండితులు విశ్లేషించారు. అయితే ఈ సినిమా రణబీర్ కెరీర్ కి కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సీక్వెల్ గురించి కొంత చర్చ సాగుతోంది.
తాజా సమాచారం మేరకు బ్రహ్మాస్త్రను థియేటర్లలో వీక్షించలేని వారు ఓటీటీలో వీక్షించే వెసులు బాటు కలగనుంది. డిస్నీ+ హాట్ స్టార్ లో బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ డిజిటల్ ప్రీమియర్ ని అందించే డేట్ ని ప్రకటించింది. వీక్షకులు హిందీ- తమిళం- తెలుగు- కన్నడ- మలయాళం నుండి తమకు నచ్చిన భాషని ఎంచుకుని సౌకర్యంగా ఓటీటీలోనూ గొప్ప అనుభూతిని పొందే అవకాశం ఉందని సమాచారం. 4 నవంబర్ 2022న బ్రహ్మాస్త్ర ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ & ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడమే గాక రచనను అందించారు.
ఈ భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ - మౌని రాయ్-నాగార్జున అక్కినేని వంటి అత్యుత్తమ నటులు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ డిజిటల్ ప్రీమియర్ థియేటర్లలో వీక్షించలేకపోయిన వారికి డిస్నీ+ హాట్‌స్టార్ లో ట్రీట్ గా మారనుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రతినిధి మాట్లాడుతూ ``డిస్నీ+ హాట్‌స్టార్ సూపర్ హీరోల నిలయం. మా ప్లాట్ ఫారమ్ కు అద్భుతమైన ఆస్ట్రావర్స్ ను స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాం! బ్రహ్మాస్త్ర ఈ సంవత్సరంలో అతిపెద్ద హిట్. ఈ నవంబర్ లో అభిమానులకు అందించడానికి ఆత్రుతగా ఉన్నాం!`` అని అన్నారు.
దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ-``బ్రహ్మాస్త్రానికి ప్రాణం పోసే ప్రయాణం చాలా ఉత్తేజకరమైనది. ఇది సవాళ్లతో కూడుకున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు నేను నిజంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. వారి అపారమైన ప్రేమ మద్దతుతో సినిమా నిలబడింది. బ్రహ్మాస్త్ర అనేది మన సుసంపన్నమైన భారతీయ సంస్కృతికి.. మన ఆధ్యాత్మికతకు సంబంధించిన గొప్ప ఉత్సవం .. మన విశిష్ట చరిత్ర సాంకేతికతను కలిపి సృష్టించిన ఒక గొప్ప ఉత్పత్తి. డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు బ్రహ్మాస్త్రాన్ని మరింత చేరువ చేయగలుగుతాం. స్నేహితులు కుటుంబాలతో కలిసి వారి ఇళ్లలో హాయిగా వీక్షించవచ్చు`` అని అన్నారు.
రణబీర్ కపూర్ మాట్లాడుతూ, -``బ్రహ్మాస్త్ర నాకు చాలా ప్రత్యేకమైన ప్రయాణ అనుభవం. ముఖ్యంగా భారతీయ సినిమా ఒరిజినల్ విశ్వాన్ని సృష్టించిన అయాన్ ముఖర్జీ గొప్ప దృష్టి ని మెచ్చుకోవాలి. జీవితంలో ఒక్కసారే ఈ అనుభవం! థియేట్రికల్ విడుదల తర్వాత ప్రపంచ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. భారతదేశంలోని అతిపెద్ద OTT ప్లాట్‌ఫారమ్ అయిన Disney+ Hotstarలో విడుదల చేయడం ద్వారా దీనిని విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మరింత చేరువ చేయడమే మా లక్ష్యం`` అని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.