Begin typing your search above and press return to search.

'బ్రహ్మాస్త్ర' ప్రీ-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణమేంటంటే..?

By:  Tupaki Desk   |   2 Sep 2022 2:31 PM GMT
బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణమేంటంటే..?
X
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ''బ్రహ్మాస్త్ర'' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు శుక్రవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వస్తారని మేకర్స్ కొన్ని రోజుల కిందటే ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక నోట్ రిలీజ్ చేశారు.

'బ్రహ్మాస్త్ర' ఈవెంట్ కు తారక్ ముఖ్య అతిథిగా ఖరారు కావడంతో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ చేరుకున్నారు. అయితే గణేష్ ఉత్సవాల దృష్ట్యా ఆర్‌ఎఫ్‌సీ వద్ద భద్రత కల్పించడం కష్టమని భావించి పోలీసులు చివరి నిమిషంలో అనుమతులను తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయినప్పటికీ.. పార్క్ హయత్ హోటల్‌ లో ప్రెస్ మీట్ నిర్వహించాలని టీమ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ మీడియా కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతున్నట్లుగా సమాచారం. దీనికి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాతో పాటు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను కూడా అనుమతిస్తున్నారు.

ఏదేమైనా మేకర్స్ చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు ప్రకటించడంపై అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తమ అభిమాన హీరోని చూడాలని సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చామని.. కానీ ఇప్పటికిప్పుడు ఈవెంట్ లేదని చెప్పడం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యమా అంటూ నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు.

కాగా, బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో రణ్‌ బీర్ కపూర్ - ఆలియా భట్ - అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సోసియో ఫాంటసీ చిత్రాన్ని నిర్మించారు.

మూడు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా మొదటి భాగం ''బ్రహ్మాస్త్రం: శివ'' పేరుతో పాన్ ఇండియా స్థాయిలో పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. దక్షిణాదిలో దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ శరవేగంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేశారు. అయితే పోలీసులు అనుమతులు నిరాకరించడంతో ఈవెంట్ ను రద్దు చేసుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.