Begin typing your search above and press return to search.
బ్రహ్మాస్త్రం.. రాజమౌళి ప్రచారాస్త్రం..!
By: Tupaki Desk | 2 Sep 2022 9:41 AM GMTబాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన "బ్రహ్మస్త్రం" చిత్రాన్ని.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. దీనికి కారణం ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీని నాలుగు దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
'బ్రహ్మాస్త్ర' సినిమాలో బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్ - అలియా భట్ - బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - మౌనీ రాయ్ లతో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతతో విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.
బ్రహ్మాస్త్ర సినిమాని మూడు భాగాలుగా ప్లాన్ చేయగా.. ''బ్రహ్మాస్త్రం: మొదటి భాగం - శివ'' ఈ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన క్యారక్టర్ పోస్టర్స్ - సాంగ్స్ మరియు ట్రైలర్ ఆసక్తిని కలిగించాయి.
సౌత్ లో ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నాగార్జున - రాజమౌళి రంగంలోకి దిగారు. ఇటీవల చెన్నైలో మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అంతకముందు రణబీర్ సింగ్ తో కలిసి హైదరాబాద్ - వైజాగ్ లలో సందడి చేశారు జక్కన్న. ఇదే క్రమంలో 'బ్రహ్మాస్త్ర' గురించి ఒక స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'బ్రహ్మాస్త్ర' భారతీయ చలనచిత్రంలో ఒక రకమైన చిత్రమని.. గత 9 ఏళ్లుగా ఈ సినిమాతో ప్రయాణం చేసిన అయాన్ ముఖర్జీ ఎట్టకేలకు సెప్టెంబర్ 9న బిగ్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నాడని రాజమౌళి పేర్కొన్నారు. సినిమా మేకింగ్ పై అతని దృష్టిని ప్రశంసించారు. ఇలాంటి సినిమాని థియేటర్లలో మిస్ కావద్దని కోరాడు.
అయితే 'బ్రహ్మాస్త్ర' సినిమాని ప్రమోట్ చేయడం పై 'బాయ్ కాట్ బాలీవుడ్' బ్యాచ్ నెట్టింట నెగెటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. రాజమౌళి అంటే తమకు అపారమైన గౌరవం ఉందని.. ఆయన బాలీవుడ్ మేకర్స్ మాయలో పడొద్దని.. హిందీ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. 'లాల్ సింగ్ చద్దా' సినిమాని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టడం మనం చూశాం. ఈ సినిమాని తెలుగులో సమర్పిస్తూ ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు మెగాస్టార్ చిరంజీవి ని కూడా టార్గెట్ చేశారు. అలానే కరణ్ జోహార్ నిర్మించిన సినిమా కావడంతో 'లైగర్' పైనా ఇలాంటి నెగెటివ్ ట్రెండ్ సృష్టించారు.
ఇప్పుడు కరణ్ జోహార్ నిర్మించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాపై కూడా బాయ్ కాట్ ట్వీట్లు పెడుతున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే అగ్ర దర్శకుడు ఇలాంటివి పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలో.. వివాదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు.
అలియా భట్ పై అంత నెగెటివిటీ ఉన్నా 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవడం రాజమౌళికే చెల్లింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగినా.. రిలీజ్ టైం కి అలియాపై నెగెటివ్ ట్రెండ్ జరగలేదు. అలియాని పెట్టుకునే ట్రిపుల్ ఆర్ తో నార్త్ మార్కెట్ లో గట్టి ప్రభావం చూపించాడు దర్శకధీరుడు.
ఇప్పుడు 'బ్రహ్మస్త్ర' సినిమా ప్రెజెంటర్ గా తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ అయితే అందులో జక్కన్న కు కూడా క్రెడిట్ దక్కుతుంది. ఈరోజు సాయంత్రం బిగ్గెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా.. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్టుగా హాజరవుతున్నారు. ఇవన్నీ కూడా సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసే అవకాశం ఉంది.
స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి 'బ్రహ్మాస్త్ర' ట్రాయాలజీని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.