Begin typing your search above and press return to search.
బుల్లితెరపై సందడి చేస్తున్న 'బ్రహ్మాస్త్ర' టీమ్..!
By: Tupaki Desk | 5 Sep 2022 10:33 AM GMTమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ''బ్రహ్మాస్త్ర'' ఒకటి. రణ్ బీర్ కపూర్ - అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా రూపొందించబడిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ''బ్రహ్మాస్త్ర: శివ'' రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
'బ్రహ్మాస్త్రం' చిత్రాన్ని దక్షిణాదిలో దర్శకధీరుడు SS రాజమౌళి సమర్పిస్తున్నారు. తెలుగులో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేశారు. అందులో భాగంగా తెలుగు టెలివిజన్ రియాలిటీ గేమ్ షో 'క్యాష్' లో ఈ సినిమా ప్రచారం చేయబడుతుంది. తాజాగా రణబీర్ కపూర్ - అలియా భట్ - మౌని రాయ్ మరియు రాజమౌళి స్వయంగా ఈ షో షూటింగ్ లో పాల్గొన్నారు.
'బ్రహ్మాస్త్ర' ప్రమోషనల్ ఎపిసోడ్ షూటింగ్ గత శుక్రవారం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసింది. స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేసిన ఈ గేమ్ షోలో చిత్ర బృందం చాలా సరదాగా గడిపింది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ తెలుగు గేమ్ షోలో ఒకేసారి ముగ్గురు ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ తో పాటుగా భారతదేశం గర్వించదదగ్గ దర్శకుడు రాజమౌళి పాల్గొనడం ఇదే తొలిసారి. 'క్యాష్' ప్రోగ్రామ్ లో 'బ్రహ్మాస్త్ర' టీమ్ తో సుమ సరదా సంభాషణలు తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. ఈ 'బ్రహ్మాస్త్ర' స్పెషల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి 9:30 గంటలకు ఈటీవీ లో ప్రసారం అవుతుంది.
ఇకపోతే 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది. 'వేక్ అప్ సిద్' 'యే జవానీ హై దీవానీ' ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు ఈ మాగ్నమ్ ఓపస్ ని నిర్మించాయి. కరణ్ జోహార్ - అపూర్వ మెహతా - నమిత్ మల్హోత్రా - రణబీర్ కపూర్ - మారిజ్కే డిసౌజా - అయాన్ ముఖర్జీ నిర్మాతలుగా వ్యవహరించారు.
ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా.. సైమన్ ఫ్రాంగ్లెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. వి. మణికందన్ - పంకజ్ కుమార్ - సుదీప్ ఛటర్జీ - వికాష్ నౌలాఖా - పాట్రిక్ డ్యూరక్స్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ప్రకాష్ కురుప్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.