Begin typing your search above and press return to search.

ఈ సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం

By:  Tupaki Desk   |   27 Jun 2018 11:30 AM GMT
ఈ సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం
X
సినిమాలకు వివాదాలు కొత్త కాదు.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చాలా మంది పలు సినిమాలను అడ్డుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ‘బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా కొందరు వ్యక్తులు తీసిన ‘బ్రాహ్మణుల అమ్మాయి.. నవాబుల అబ్బాయి’ సినిమా విడుదలను ఆపాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ‘దర్శనమ్’ ఎడిటర్ ఎం వెంకటరమణ శర్మ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు..

‘బ్రాహ్మణుల అమ్మాయి.. నవాబుల అబ్బాయి’ సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేవిధంగా ఉందని ఆయన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ సినిమా ట్రైలర్ ను యూట్యూబ్ లోంచి తీసేయాలని.. సోషల్ మీడియాలో కూడా లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోస్టర్ ను, టైటిల్ ను మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తగిన ఆదేశాలివ్వాల్సిందిగా కోరారు.

ఈ మేరకు ఆయన త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను, డీజీపీ మహేందర్ రెడ్డిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రీజినల్ ఫిలిం సెన్సార్ బోర్డు అధికారిని కలవునున్నట్లు ఆయన తెలిపారు.