Begin typing your search above and press return to search.

అయ్యో.. ఇదంతా బ్రహ్మోత్సవం ఎఫెక్టే

By:  Tupaki Desk   |   19 Jun 2016 11:00 PM IST
అయ్యో.. ఇదంతా బ్రహ్మోత్సవం ఎఫెక్టే
X
ఒక సినిమా హిట్టయ్యిందంటే.. వెనుకనే పెద్ద హీరోలందరూ పడతారు. అదే ఒక సినిమా ఫ్లాపైందంటే మాత్రం.. ఎవ్వరూ ముఖం చూడరు. పాత తరంలో చిరంజీవి వంటి హీరోలు వరసుగా రాఘవేంద్రరావు తీసిన మూడు సినిమాలు ఫ్లాపైనా పిలిచి మరీ జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి ప్రాజెక్టును చేతిలో పెట్టారేమో కాని.. ఇప్పటి తరంలో కాస్త కష్టమే.

నిజానికి ''ముకుంద'' సినిమా ఫ్లాపైనా కూడా.. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మీదున్న నమ్మకంతో ''బ్రహ్మోత్సవం'' సినిమా చేతిలో పెట్టాడు మహేష్‌ బాబు. అయితే టైమ్ బాలేదేమో.. ఇది కూడా బెడసి కొట్టేసింది. అందుకని ఇప్పుడు కుర్ర హీరోలు అసలు శ్రీకాంత్‌ కథ చెబుతానంటే కూడా వినడంలేదట. పైగా కథ విన్నాక కూడా నో అనేస్తున్నారట. ఇప్పటికే ఓ ఇద్దరికి కథ చెప్పిన శ్రీకాంత్‌ చాలా డిజప్పాయింట్‌ అయ్యాడని ఒక రూమర్ ఆల్రెడీ వినిపిస్తోంది. మరి నిజంగానే శ్రీకాంత్‌ కథలో సత్తా లేదా లేకపోతే అతడి బ్రహ్మోత్సవం రిజల్టును చూసి కంగారుపడుతున్నారా అనే విషయం మాత్రం తెలియదు.

ఇకపోతే కరక్టు కథతో వస్తే సినిమా చేయడానికి రెడీ అంటూ ఇద్దరు మెగా హీరోలు ఇప్పటికే శ్రీకాంత్‌ కు మాటిచ్చారని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో!!